కరోనా ఎఫెక్ట్.. మా భార్య ఏ పని చెబితే.. అది చేస్తున్నానన్న కమెడియన్ అలీ

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో సెలబ్రెటీలు తమ ఇళ్లలో పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా కమెడియన్ అలీ ఇంటిపనుల్లో తన భార్యకు సాయమందించాడు.

news18-telugu
Updated: March 29, 2020, 3:56 PM IST
కరోనా ఎఫెక్ట్.. మా భార్య ఏ పని చెబితే.. అది చేస్తున్నానన్న కమెడియన్ అలీ
కరోనా ఎఫెక్ట్.. మా భార్య ఏ పని చెబితే.. అది చేస్తున్నానన్న కమెడియన్ అలీ
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో గల్లీలో కూలీ పనిచేసే కార్మికుడి దగ్గరి నుంచి దేశ అత్యున్నత స్థాయి వ్యక్తుల వరకు అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దాదాపు అన్ని రంగాల్లోని వారి పరిస్థితి ఇంతే. నిత్యం బిజీగా ఉండే క్రికెటర్లు, సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖులు సైతం ఇంట్లోనే ఉండిపోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎవరి పనులు వారే చేసుకుంటున్నారు. ఇంట్లో కూరగాయలు కట్ చేయడం దగ్గరి నుంచి బాత్ రూమ్స్ క్లీన్ చేసే వరకు అంతా వాళ్లే చేసుకుంటున్నారు. ఇంటి పనులు చేస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తాజాగా కమెడియన్ అలీ తన ఇంటి పనుల్లో భార్యకు సాయం చేస్తోన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘ఇంట్లో మా ఆవిడ ఏం పని చెబితే అది చేస్తున్నా. నిత్యం కార్లను శుభ్రం చేయడంతో పాటు ఇంట్లో పనిచేస్తున్నాను. కూరగాయలు కట్ చేయడం, ఇల్లుశుభ్రపరచడం, వంట చేయడం చేస్తున్నాను. మరికొంతసేపు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నా’ అని అలీ చెబుతున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Published by: Narsimha Badhini
First published: March 29, 2020, 3:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading