హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja- Ali: 'ఆ' లెటర్ సెంటిమెంట్.. వేసవిలోనూ రవితేజకు హిట్ గ్యారెంటీ అన్న అలీ

Ravi Teja- Ali: 'ఆ' లెటర్ సెంటిమెంట్.. వేసవిలోనూ రవితేజకు హిట్ గ్యారెంటీ అన్న అలీ

‘క్రాక్’లో రవితేజ (Raja Krack movie)

‘క్రాక్’లో రవితేజ (Raja Krack movie)

మాస్‌రాజా ర‌వితేజ(Ravi Teja) మరో సూప‌ర్‌హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌లైన ర‌వితేజ మూవీ క్రాక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈ మూవీకి మొద‌టి రోజు నుంచి పాజిటివ్ టాక్ రాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌లోనూ దూసుకుపోతోంది

ఇంకా చదవండి ...

  Ravi Teja- Ali: మాస్‌రాజా ర‌వితేజ మరో సూప‌ర్‌హిట్‌ని ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌లైన ర‌వితేజ మూవీ క్రాక్ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈ మూవీకి మొద‌టి రోజు నుంచి పాజిటివ్ టాక్ రాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్‌లోనూ దూసుకుపోతోంది. ఈ మూవీ హిట్ అవ్వడంతో ఇటు ర‌వితేజ ఫ్యాన్స్ కూడా సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. త‌మ హీరోకు గ్రాండ్ రీఎంట్రీ దొరికిందంటూ వారు సంతోష‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ స‌క్సెస్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఇందులో పాల్గొన్న అలీ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. అలీ మాట్లాడుతూ.. ర‌వితేజ‌కు కె సెంటిమెంట్ ఉంద‌ని, దీని ప్ర‌కారం స‌మ్మ‌ర్‌లో మ‌రో హిట్ గ్యారెంటీ అని అన్నారు.

  కె లెట‌ర్‌తో ర‌వితేజ న‌టించిన కిక్, కృష్ణ చిత్రాలు పెద్ద విజ‌యాలు సాధించాయ‌ని.. ఇప్పుడు క్రాక్ స‌క్సెస్ అయ్యింద‌ని.. ఇక వేస‌విలో రాబోతోన్న కిలాడి కూడా కెతో ప్రారంభం అవుతుండ‌టంతో.. ఆ మూవీ హిట్ అవ్వ‌డం గ్యారెంటీ అని అలీ అన్నారు.

  కాగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కిలాడీ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో ర‌వితేజ ద్విపాత్రాభిన‌యంలో న‌టిస్తుండ‌గా.. ఆయ‌న‌ స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తీ, మీనాక్షి చౌద‌రీ రొమాన్స్ చేయ‌నున్నారు. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జ‌న‌వ‌రి 26న గ‌ణ‌తంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ మూవీ టీజ‌ర్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

  Published by:Manjula S
  First published:

  Tags: Ali, Ravi Teja

  ఉత్తమ కథలు