హోమ్ /వార్తలు /సినిమా /

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ మృతి..!

కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి

కమెడియన్ రాజు శ్రీవాస్తవ మృతి

జిమ్‌లో థ్రెడ్ మిల్ పై ఎక్సైర్ సైజ్ చేస్తున్న శ్రీవాస్తవ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌ చేస్తూ గత నెల 10న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంటిలెటర్‌ సపోర్టుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. ఆగష్టు 10న ఆయనకు గుండె పోటు రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.  అక్కడ చికిత్స పొందుతున్న ఆయన  ఇవాళ కన్నుమూశారు, శ్రీవాస్తవ వయసు 58 ఏళ్లు.

  ఆగష్టు 10న రాజు శ్రీవాస్తవ డైలీ ఎక్సర్‌సైజులో భాగంగా... జిమ్‌లో ఉన్నారు. అక్కడ త్రెడ్ మిల్ పై నడుస్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే అక్కడున్న వారంతా ఆయనను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. దాదాపుగా 40 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  1980 నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతుండగా.. 2005లో రియాలిటీ స్టాండప్‌ కామెడీ షో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ చాలెంజ్‌’ మొదటి సీజన్‌ తర్వాత మంచి గుర్తింపు పొందాడు. రాజు శ్రీవాస్తవ మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా , అమ్దాని అఠాని.. ఖర్చ రుపయ్య  చిత్రాల్లోనూ నటించాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగుతున్నాడు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Bollywood, Bollywood actor

  ఉత్తమ కథలు