Home /News /movies /

వెంకన్న స్వామి వేషం వేసాడు.. శ్రీవారి ఛానల్‌కు చైర్మన్ అయ్యాడు.. 30 ఇయర్స్ పృథ్వీరాజ్..

వెంకన్న స్వామి వేషం వేసాడు.. శ్రీవారి ఛానల్‌కు చైర్మన్ అయ్యాడు.. 30 ఇయర్స్ పృథ్వీరాజ్..

SVBC చైర్మన్‌గా కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (ఫైల్ ఫోటోస్)

SVBC చైర్మన్‌గా కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (ఫైల్ ఫోటోస్)

ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో సినిమా వాళ్లు కూడా బాగానే శ్రమించారు. ఇప్పటికే సినీ నటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో గౌరవించిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..తాజాగా హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా నియమించారు.

ఇంకా చదవండి ...
    2019 ఏపీలో జరిగిన ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైయస్ఆర్‌సీపీ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో సినిమా వాళ్లు కూడా బాగానే శ్రమించారు. ఇప్పటికే సినీ నటి రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవితో గౌరవించిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి..తాజాగా హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో పృథ్వీరాజ్ బాలిరెడ్డిని ఆ ఛానెల్ చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించింది. రీసెంట్‌గా పృథ్వీ..ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే కదా.

    Comedian 30 Years Prudhvi met AP CM YS Jagan and He will be elected as SVBC Chairman pk.. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డంలో ఎంతోకొంత ఈ సారి సినిమా వాళ్ల శ్ర‌మ కూడా ఉంది. వాళ్లు కూడా ఏక‌మై ఈయ‌న‌కు స‌పోర్ట్ చేసారు. ఒక‌రో ఇద్ద‌రో కాదు.. చాలా మంది సినిమా వాళ్లు ఈ సారి జ‌గ‌న్ కోసం ప‌ని చేసారు. comedian 30 years prudhvi raj,comedian 30 years prudhvi raj twitter,comedian 30 years prudhvi raj svbc chairman,ap cm ys jagan twitter,ys jagan,prudhvi raj,comedian prudhvi raj,prudhvi raj about ys jagan,ys jagan mohan reddy,actor prudhvi raj,prudhvi raj interview,prudhvi raj comedy,prudhvi raj ys jagan,ys jagan speech,prudhvi raj ysrcp,prudhvi raj meets ys jagan,comedian prudhvi raj meets ys jagan,prudhvi raj about ys jagan mohan reddy,prudhvi raj about pawan kalyan,prudhvi raj about jagan,ys jagan padayatra,ap cm ys jagan,telugu cinema,k raghavedra rao svbc chairman,వైఎస్ జగన్,30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్,వైఎస్ జగన్ పృథ్వీ రాజ్,SVBC ఛైర్మన్‌గా పృథ్వీ రాజ్
    వైఎస్ జగన్ పృథ్వీ రాజ్


    గత కొన్నిరోజులగా ఆయనను ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమిస్తారని సోషల్ మీడియాలో  జోరుగా ప్రచారం జరిగింది.  తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ.. వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ప్రతిష్టాత్మకమైన ఎస్వీబీసీ చైర్మన్ పదవితో గౌరవించింది. గతంలో పృథ్వీరాజ్ దేవుళ్లు సినిమాలో శ్రీవేంకటేశ్వర స్వామి పాత్రలో కాసేపు కనిపించారు. గతంలో తెలుగుదేశం హయాంలో కే.రాఘవేంద్రరావు ఎస్వీబీసీ చైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో రాఘవేంద్రరావు తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన ప్లేస్‌లో పృథ్వీరాజ్ త్వరలో ఎస్వీబీసీ చానెల్ బాధ్యతలు చేపట్టనున్నారు.
    First published:

    Tags: 30 Years Prudhvi Raj, Ap cm ys jagan mohan reddy, Svbc, Telugu Cinema, Tollywood, Ysrcp

    తదుపరి వార్తలు