హోమ్ /వార్తలు /సినిమా /

కలర్స్ స్వాతి న్యూ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’.. టీజర్ అదుర్స్

కలర్స్ స్వాతి న్యూ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’.. టీజర్ అదుర్స్

Month of madhu Teaser Photo Twitter

Month of madhu Teaser Photo Twitter

Colors Swathi Month of madhu: యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌, కలర్స్ స్వాతి న్యూ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేపడుతున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌ (Naveen Chandra). ఈ వెర్స‌టైల్ పెర్ఫామర్ లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’ (Month of madhu). శ్రీకాంత్ నాగోటి (Srikanth nagoti) దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో కలర్స్ స్వాతి (Colors Swathi) నటిస్తోంది. ఇంతకు ముందు న‌వీన్ చంద్ర, శ్రీకాంత్ నాగోటి కాంబినేష‌న్‌లో రూపొందిన ‘భానుమతి అండ్ రామకృష్ణ’ మూవీ ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. 2020లో ఆహా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది.

రీసెంట్‌గా రిలీజైన ‘మంత్ ఆఫ్ మ‌ధు’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గురువారం మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. టీజర్‌ను గ‌మ‌నిస్తే 1 నిమిషం 58 సెక‌న్లుగా ఉంది. అందులో బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో సినిమా క‌థేంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సింక్ సౌండ్ ఎఫెక్ట్‌తో రియ‌లిస్టిక్‌, నేచుర‌ల్‌గా ఉంది. హీరో హీరోయిన్స్ న‌ట‌నతో మెప్పించారు.

మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే ‘మంత్ ఆఫ్ మ‌ధు’ చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సింక్ సౌండ్‌తో ‘మంత్ ఆఫ్ మ‌ధు’ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాలో శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు. అతి త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Published by:Sunil Boddula
First published:

Tags: Colors swathi, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు