Hyper Aadi: హైపర్ ఆదికి ప్రపోజ్ చేసిన కాలేజ్ అమ్మాయి.. అందరి ముందు అలా చెప్పడంతో..?

Hyper Aadi

Hyper Aadi: బుల్లితెరలో ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది కమెడియన్స్ తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు.

  • Share this:
    Hyper Aadi: బుల్లితెరలో ప్రసారమౌతున్న కామెడీ షో జబర్దస్త్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఎంతో మంది కమెడియన్స్ తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ స్టార్ కమెడియన్ గా నిలిచిన హైపర్ ఆది గురించి, తన కామెడీ పంచ్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే సరైన టైమింగ్ లో పంచ్ లు వేసి మంచి గుర్తింపు అందుకున్నారు.

    అంతేకాకుండా ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ తెగ పంచులు వేస్తూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు అవతలివారిని కించపరిచేలా కూడా చేస్తుంటాడు. ఇక జబర్దస్త్ లో అనసూయ తో కలిసి ఒక రొమాంటిక్ డాన్స్ చేస్తుంటాడు. ఇదిలా ఉంటే మరో బుల్లితెర డాన్స్ షో లో కూడా టీం లీడర్ గా చేస్తున్నాడు హైపర్ ఆది. ఇక ఈవెంట్ సమయాల్లో హైపర్ ఆది చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే హైపర్ ఆదికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా హైపర్ ఆదికి లవ్ ప్రపోజల్ కూడా వచ్చింది .

    ఈటీవీలో ప్రసారమవుతున్న మరో ఎంటర్టైన్మెంట్ షో క్యాష్ ప్రోగ్రాం లో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, దీపిక పిల్లి, భాను శ్రీ పాల్గొన్నారు. ఇక తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సుమ తో కాసేపు సందడి చేశారు. ఇదిలా ఉంటే చివరిలో కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి చేసే ఓ సన్నివేశంలో..ఓ కాలేజ్ అమ్మాయి హైపర్ ఆది ని ప్రపోజ్ చేసింది. హైపర్ ఆది ని చూస్తూ.. ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్న అంటూ.. కానీ ఛాన్స్ రావట్లేదు అని మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నానోనని మాటల్లో చెప్పలేను అని ప్రపోజ్ చేసింది. దీంతో ఆది సిగ్గు పడుతూ ఉండగా.. వెంటనే రామ్ ప్రసాద్ వారిద్దరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి ఇంట్లో మాట్లాడి సంబంధం ఓకే చేద్దామని అంటూ మరింత సందడి చేశాడు. ప్రస్తుతం ఈ ప్రపోజల్ సీన్ వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: