మోహన్ బాబు మంచి నటుడే కాదు.. ఆయనో విద్యావేత్త.పూర్వశ్రమంలో డ్రిల్ టీచర్‌గా పనిచేయడంతో సినిమాల్లో సంపాదించిన డబ్బుతో శ్రీవిద్యానికేతన్ సంస్థలను స్థాపించాడు. ఈ విద్యాసంస్థలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరే ఉంది. ఇక శ్రీవిద్యానికేతన్ కు రావాల్సిన ఫీజ్ రీఎంబర్స్‌మెంట్ విషయంలో గత కొన్నిరోజులుగా మోహన్ బాబుకు ఏపీ ప్రభుత్వానికి పెద్ద రచ్చే నడుస్తోంది. తన సంస్థకు రావాల్సిన ఫీజు బకాయిల విషయంలో మోహన్ బాబు రోడ్డక్కిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో సుధీర్ఘమైన లేఖను పోస్ట్ చేసారు. 2013లో అధికారంలో లేని చంద్రబాబును నా విద్యాసంస్థలకు తీసుకొచ్చాను. నాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, సినిమా ఓపెనింగ్స్ ఎన్ని జరిగాయే అన్నింటికీ బాబును ఆహ్వానించాను. ఆయన కూడా శ్రీవిద్యానికేతన్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాత్రం నా మీద, నా కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మోహన్ బాబు ఆరోపించారు.
It starts now pic.twitter.com/LCaweTB3e4
— Mohan Babu M (@themohanbabu) March 23, 2019
నేను అడిగింది నాకు సంబంధించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ డబ్బును ఇవ్వాలని అడిగాను. అంతకన్న ఏమిలేదు. ఈ విషయంలో ఏమైనా ఉంటే నేరుగా నాతోనే మాట్లాడండి. ఇతరుల చేత చెప్పించొద్దు. ప్రజలు ఈ విషయాలన్ని గమనిస్తున్నారన్నారు.
ఇక మోహన్ బాబు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకం. అందులో అన్ని పేజీలు ప్రజలకు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు జీవితం మాత్రం మూసి ఉన్న పుస్తకం అన్నారు. ఆయన నాపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టారు. తెలుగు దేశం పార్టీలో కూడా నన్ను అభిమానించే వాళ్లు చాలా మంది ఉన్నారు. వారంత అన్న ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమతో తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. అది మీ అభిమానం. అది నేను కాదనను. ఇకఇప్పటి వరకు జరిగిన విషయాలను ఇంతటీ ఒదిలేద్దాం. నేను కానీ రంగంలోకి దిగితే విషయం చాలా దూరం వెళుతుందన్నారు మోహన్ బాబు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Politics, Chandrababu naidu, Manchu Family, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Mohan Babu, NTR, Tdp, Telugu Cinema, Tollywood, Ys jagan, Ysrcp