ఆండ్రాయుడు కోసం పెదరాయుడు.. ‘కొబ్బరిమట్ట’కు ప్రీ రిలీజ్‌కు మోహన్ బాబు..

Kobbari Matta | సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరికాసేట్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఆండ్రాయుడును ఆశీర్వదించడానికి పెదరాయుడు అదేనండి మోహన్ బాబు ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు.

news18-telugu
Updated: August 7, 2019, 5:04 PM IST
ఆండ్రాయుడు కోసం పెదరాయుడు.. ‘కొబ్బరిమట్ట’కు ప్రీ రిలీజ్‌కు మోహన్ బాబు..
మోహన్ బాబు,సంపూర్ణేష్ బాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
కొన్నేళ్ల క్రితం ‘హృదయ కాలేయం’ మూవీతో టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో  పాపులర్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. ఆ ఊపులోనే ‘సింగం 123’, వైరస్ లాంటి మూవీలు చేసాడు. అవేమి...అతడికి మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఫస్ట్ మూవీతో ఎంత పాపులర్ అయ్యాడో...ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ఆ పాపులారిటీని కాపాడుకోలేకపోయాడు.ఆల్రెడీ సంపూ బాబు..రెండేళ్ల కింద ‘కొబ్బరిమట్ట’ అనే సినిమా చేసాడు. రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వెరైటీగా ప్రమోషన్స్ చేస్తూ ఈ మూవీపై క్రేజ్ తీసుకురాగలిగాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో...ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఎపుడో రెండేళ్ల కింద రావాల్సిన ఈ మూవీ ఇప్పటికీ అడ్రస్ లేదు. ఇదిగో అదిగో అంటున్న సినిమా మాత్రం విడుదల కావడం లేదు.ఎపుడో విడుదల కావాల్సి ఉన్న ఫైనాల్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కున్న అడ్డంకులు తొలగడంతో ఇపుడీ సినిమాను ఆగష్టు 10న  విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పాపారాయుడు, పెదరాయడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో నటించాడు.

collection king mohan babu chief guest of sampoornesh babus kobbari matta pre release event,kobbari matta pre release event,kobbari matta movie review,kobbari matta,sampoornesh babu,mohan babu chief guest of kobbari matta pre release evetn,mohan babu,mohan babu sampoornesh babu,mohan babu sampoo,kobbari matta movie,kobbari matta trailer,sampoornesh babu kobbari matta,kobbari matta movie songs,kobbari matta teaser,kobbari matta songs,kobbari matta theatrical trailer,sampoornesh babu dance,kobbari matta telugu movie,sampoornesh babu kobbari matta movie,sampoornesh babu movies,kobbari matta movie trailer,kobbari matta video songs,samapoornash babu kobbari matta,tollywood,telugu cinema,కొబ్బరిమట్ట,సంపూ,సంపూర్ణేష్ బాబు,సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట,ఆండ్రాయుడు డైలాగ్,పాపా రాయుడు,పెద రాయుడు,కొబ్బరిమట్ట,మోహన్ బాబు,కొబ్బరిమట్టకు ఛీఫ్ గెప్ట్‌గా మోహన్ బాబు,మోహన్ బాబు సంపూర్ణేష్ బాబు,మోహన్ బాబు సంపూర్ణేష్ బాబు,
కొబ్బరి మట్ట ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Twitter/Photo)


తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మరికాసేట్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఆండ్రాయుడును ఆశీర్వదించడానికి పెదరాయుడు అదేనండి మోహన్ బాబు ముఖ్యఅతిథిగా రాబోతున్నాడు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. నా లాంటి చిన్ననటుడు అడిగిన వెంటనే మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడు గారికి వందనాలు అంటూ సోషల్ మీడియాలో ధన్యవాదాలు తెలిపాడు. లేటుగా అయినా లెేటెస్ట్‌గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘కొబ్బరిమట్ట‌’తో సంపూ మరో ఇంపైన హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: August 7, 2019, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading