అవును.. టాలీవుడ్ ఇద్దరు బడా హీరోలు.. తమ సినిమాల విడుదల విషయంలో ఇంకా ఎడతెగని పంచాయితీ నడుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ బాబు..‘సరిలేరే నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ ముందుగా జనవరి 12న పోటాపోటీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాను మహేష్ బాబు, దిల్ రాజు టీమ్‌కు తెలియకుండా.. జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో మహేష్ బాబు.. తన సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను హడావుడిగా డేట్ ప్రకటించారు. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదలైతే.. కలెక్షన్స్ పరంగా రెండు సినిమాలకు ఇబ్బందే అని చెప్పాలి. ఒకవేళ హిట్ టాక్ వస్తే ఓకే.. అదే కానీ ఫ్లాప్ టాక్ పడిందా.. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడం ఖాయం. ఆ తర్వాత దిల్ రాజు రంగంలోకి తమ సినిమాకు ఒక రోజు ముందుగా జనవరి11న రిలీజ్ అయ్యేలా మహేష్ బాబును ఒప్పించాడు. కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల ‘అల వైకుంఠపురములో’ సినిమాను తాజాగా జనవరి 10న ప్రీ పోన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. మహేష్ బాబు, దిల్ రాజు తమ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’సినిమా అదే రోజున విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది.
అల్లు అర్జున్, మహేశ్ బాబు
తాజాగా త్రివిక్రమ్, అనిల్ సుంకర రంగంలోకి దిగి జనవరి 10 హిస్టరీని గుర్తు చేస్తున్నారు. గతంలో 2010 జనవరి 10వ తేదిన మహేష్ బాబు.. ‘వన్ నేనొక్కడినే’ సినిమాను రిలీజై ఫ్లాప్ అయింది. అదే సమయంలో 2018 జనవరి 10న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్...‘అజ్ఞాతవాసి’ మూవీ విడుదలై డిజాస్టర్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అందుకే ముందుగా చెప్పినట్టు జవనరి 11, 12న నిర్ణయించినట్టు ఎవరి సినిమాలు వాళ్లు విడుదల చేసుకుంటే ఎవరికీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఉండవని చెబుతున్నారు. ఈగోలకు పోతే.. ఇద్దరు నష్టపోతారని ఈ సందర్చంగా గుర్తు చేస్తున్నారు. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల విషయమై.. చిరంజీవిని రంగంలోకి దిగబోతన్నట్టు సమాచారం. మొత్తానికి ఇద్దరి హీరోల వెండితెర పోరాటం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.