Sye raa:అమితాబ్, చిరంజీవి మధ్య ఏం జరిగింది .. అందుకే 'బిగ్ బీ' సైలెంట్ అయ్యారా..

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ బరిలో దిగడానికి సై అంటోంది. ఇక అమితాబ్ మాత్రం ఈ సినిమా పై సైలెంట్ మెయింటేన్ చేయడం వెనక ఇద్దరి మధ్య ఏదో జరిగిందా అని బీ టౌన్ వర్గాలతో పాటు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

news18-telugu
Updated: September 18, 2019, 12:22 PM IST
Sye raa:అమితాబ్, చిరంజీవి మధ్య ఏం జరిగింది .. అందుకే 'బిగ్ బీ' సైలెంట్ అయ్యారా..
అమితాబ్,చిరంజీవి
news18-telugu
Updated: September 18, 2019, 12:22 PM IST
Sye raa Narasimha Reddy Trailer: మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ బరిలో దిగడానికి సై అంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను ఈ నెల 22న నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అందుకే ఈరోజు సైరా నరసింహారెడ్డి టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు.  ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్నపాత్రలో నటించారు. ఐతే తమ సినిమాలో బిగ్‌బీ  భాగం కావడాన్ని మెగాస్టార్ గౌరవంగా ఫీలవుతున్నాను అంటూ పులు సందర్భాల్లో  వెల్లడించారు. అంతేకాకుండా ప్రయాణానికి తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. బిగ్ బీ తన సొంత చార్టర్ ఫ్లైట్‌లోనే షూటింగ్‌కు వచ్చే వారని.. తన సినిమాలో అమితాబ్ భాగం అవ్వడం తన అదృష్టమని చిరు సంతోషంగా చెప్పుకొచ్చారు.ఐతే.. బిగ్ బీ మాత్రం ‘సైరా’ సినిమాపై ఎప్పటినుంచో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు.

cold war between chiranjeevi and amitabh bachchan for sye raa narasimha reddy movie these are the reasons,sye raa narasimha reddy trailer,sye raa narasimha reddy trailer talk,chiranjeevi,amitabh bachchan,chiranjeevi amitabh bachchan,chiranjeevi amitabh bachchan cold war,sye raa narasimha reddy chiranjeevi amitabh bachchanSye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy trailer,chiranjeevi twitter,chiranjeevi instagram,sye raa trailer,Sye Raa digital and satellite rights,Sye Raa Narasimha Reddy digital rights,sye raa satellite rights,telugu cinema,సైరా,సైరా డిజిటల్ రైట్స్,సైరా శాటిలైట్ రైట్స్,తెలుగు సినిమా,సైరా నరసింహా రెడ్డి,అమితాబ్ బచ్చన్,చిరంజీవి,అమితాబ్ బచ్చన్ చిరంజీవి,సైరా నరసింహారెడ్డి అమితాబ్ బచ్చన్ చిరంజీవి,
‘సైరా నరసింహారెడ్డి’ కొత్త పోస్టర్ (Twitter/Photo)


అటు ఏ ఇంటర్వ్యూలో గానీ.. ఇటు తన ట్విట్టర్‌లో గానీ ఈ మూవీ గురించి అమితాబ్ స్పందించకపోవడం విశేషం. సినిమా షూటింగ్‌ ప్రారంభమైన మొదట్లో ‘‘సూపర్‌స్టార్ చిరంజీవి అదే ఫ్రేమ్‌లో ఒక గౌరవం ఉండాలి’’.. ‘‘మెగాస్టార్‌తో పనిచేయడం ఒక గౌరవం’’ అని రెండు ట్వీట్లు మాత్రమే చేసిన బిగ్‌బీ.. ఆ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.తాను నటించే ప్రతి సినిమా విశేషాలను అమితాబ్ సాధారణంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు అమితాబ్. అయితే ఈ సినిమాలో నటించినప్పటికీ అమితాబ్ మాత్రం ఎలాంటి ప్రమోషన్లుకు హాజరు కాకపోవడం గమనర్హం.ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు ‘సైరా నరసింహారెడ్డి’పై అమితాబ్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు, చిరు,అమితాబ్ మధ్య ఏదయినా జరిగిందా అంటూ గుసగుసలు బయలు దేరుతున్నాయి.

First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...