హోమ్ /వార్తలు /సినిమా /

Cobra second look: షాకింగ్ లుక్‌లో విక్రమ్.. కోబ్రా రచ్చ మామూలుగా లేదుగా..

Cobra second look: షాకింగ్ లుక్‌లో విక్రమ్.. కోబ్రా రచ్చ మామూలుగా లేదుగా..

కోబ్రా మూవీలో విక్రమ్

కోబ్రా మూవీలో విక్రమ్

Cobra Second Look: కోబ్రా చిత్రంలో విక్రమ్ హీరోగా‌, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు.

విక్రమ్ (Vikram).. వెరైటీ గెటప్‌లు.. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్. విక్రమ్ సినిమా వస్తుందంటే.. తెరపై కొత్త తరహా కథ చూడవచ్చని సగటు సినీ సినీ ప్రేక్షకుడు భావిస్తాడు. మూస కథకు భిన్నంగా సినిమాలు తీసే విక్రమ్..  ఈసారి మరో  సరికొత్త మూవీతో మన ముందుకొస్తున్నారు. అదే కోబ్రా (Cobra). ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్న ఈ కోబ్రా.. కరోనా లేకుంటే ఎప్పుడో థియేటర్లలోకి వచ్చేది. కానీ కరోనా కారణంగా ఆలస్యమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చేసింది. కోబ్రాలో విక్రమ్ సెకండ్ లుక్‌ను సెవెన్ స్క్రీన్ స్టూడియో విడుదల చేసింది. ఆ ఫొటోలో పొడవాటి.. గజిబిజి జట్టుతో కనిపించాడు విక్రమ్. అంతేకాదు ఎన్నో అంకెలు, ఫార్ములాలు అతడి మెదుడులో ఉన్నట్లు చూపించారు. ప్రతి సమస్యకూ గణిత పరిష్కారం ఉంటుందని క్యాప్షన్ పెట్టారు. ఈ కొత్త లుక్ విక్రమ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


కోబ్రా మూవీలో హీరో విక్రమ్ 20పైగా విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం మార్చిలో రష్యాకు వెళ్లారు. ఐతే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. వారంతా తిరిగి ఇండియాకు చేరుకున్నారు. కొన్ని రోజుల క్రితం సినిమా చిత్రీకరణకు ప్రభుత్వాలు అనుమతివ్వడంతో.. కోబ్రా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టారు. రష్యాలో చిత్రీకరించిన సన్నివేశాలను తమిళనాడులోనే షూట్ చేస్తున్నారు.

కోబ్రా చిత్రంలో విక్రమ్ హీరోగా‌, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు. వీరితో పాటు కేఎస్‌ రవికుమార్‌, శ్రీనిధి శెట్టి, మృణాలిని, కనికా, పద్మప్రియ, బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. కోబ్రా మూవీ షూటింగ్‌ను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Kollywood, Tamil Film News, Tollywood, Vikram

ఉత్తమ కథలు