Home /News /movies /

CM KUMARASWAMY WIFE RADHIKA KUMARASWAMY FILM SAMHARINI TEASER RELEASE MK

అరుంధతి పాత్రలో మాజీ సీఎం సతీమణి...చూస్తే షాకవ్వాల్సిందే...

రాధికా కుమారస్వామి (Image: News18 Kannada)

రాధికా కుమారస్వామి (Image: News18 Kannada)

నటిగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రాధిక...అరుంధ‌తి త‌ర‌హా ఓ భారీ హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్ర‌ంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి న‌వ‌ర‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

    క‌ర్ణాటక మాజీ సీఎం సతీమణి రాధికా కుమారస్వామి కథానాయికగా ఓ భారీచిత్రం రూపొందుతోంది. మొత్తం 5 భాషల్లో విడుదల అవుతున్న ఈ చిత్రానికి కన్నడ, మళయాళ, తమిళ, హిందీ భాషల్లో దమయంతిగా టైటిల్ నిర్ణయించారు. అయితే తెలుగులో మాత్రం సంహారిణి పేరుతో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. కుట్టి రాధికగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాధికా కుమార స్వామి తొలి సినిమా నుంచే సంచలనాలకు తెరలేపారు. అయితే కెరీర్ మంచి దశలో ఉన్న స‌మ‌యంలోనే ఆమె క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామిని ర‌హ‌స్య వివాహం చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్పి కొన్ని చిత్రాల‌కు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించారు. రాధిక కుమారస్వామిగా ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నటిగా రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన రాధిక...అరుంధ‌తి త‌ర‌హా ఓ భారీ హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్ర‌ంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

    ఈ చిత్రానికి న‌వ‌ర‌స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మి వృషాద్రి ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఈ గీతా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సంహారిణి టీజ‌ర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. నిజానికి ఈ చిత్రంలో అనుష్క న‌టించాల్సింది. ఆ త‌ర్వాత రాధిక‌ ఆసక్తి చూపడంతో ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది. టీజర్ లో రాధిక లుక్ అచ్చం అరుంధతి సినిమా తరహాలో ఉండటం ప్రేక్షకులకు మరో హారర్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి కలిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

    First published:

    Tags: Hd kumaraswamy, Kannada, Karnataka, Tollywood Box Office Report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు