చిరంజీవి, నాగార్జున.. కేసీఆరే చెప్పారు.. నిర్మాత సి. కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

హీరో బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనే కామెంట్ ఎందుకు చేశారో తనకు తెలియదని నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: May 29, 2020, 1:40 PM IST
చిరంజీవి, నాగార్జున.. కేసీఆరే చెప్పారు.. నిర్మాత సి. కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
చిరంజీవి కేసీఆర్ (Chiranjeevi KCR)
  • Share this:
సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయంలో చిరంజీవి, నాగార్జున లీడ్ తీసుకోవాలని సీఎం కేసీఆరే చెప్పారని నిర్మాత సి. కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే వాళ్లు ఆ సమావేశానికి వచ్చారని వివరించారు. చిరంజీవి ఇంట్లో ముగిసిన సినీ ప్రముఖల సమావేశం ముగిసి అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హీరో బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనే కామెంట్ ఎందుకు చేశారో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుకునే సమావేశాలే జరిగాయని తెలిపారు. మరోవైపు అవసరమైనప్పుడు సి. కళ్యాణ్ అందర్నీ పిలుస్తారని మరో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. రన్నింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాట్లాడారని ఆయన అన్నారు. ఆ సమావేశానికి తనను కూడా పిలవలేదని తెలిపారు. మహేశ్, వెంకటేశ్ ఇలా చాలామందిని పిలవలేదని గుర్తు చేశారు. బాలయ్య, నాగబాబు వ్యాఖ్యలు వాళ్ల వ్యక్తిగతమని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.
First published: May 29, 2020, 1:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading