Climax Movie Review: క్లైమాక్స్ మూవీ రివ్యూ.. సగమే ఆకట్టుకున్న క్లైమాక్స్..

క్లైమాక్స్ మూవీ రివ్యూ (Twitter/Photo)

Climax Movie Review | నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా మధ్యలో కథ నచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆయన నటించిన సినిమా క్లైమాక్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.

 • Share this:
  నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు
  ఎడిటర్: బసవ పైడి రెడ్డి
  మ్యూజిక్: రాజేష్, నిద్వాన
  సినిమాటోగ్రఫీ: రవి కుమార్ నీర్ల
  ఆర్ట్ డైరెక్టర్: రాజ్ కుమార్, రవి (ముంబై)
  దర్శకత్వం: భవాని శంకర్ కే
  నిర్మాతలు: రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి

  నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా మధ్యలో కథ నచ్చినప్పుడు హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఇప్పుడు ఆయన నటించిన సినిమా క్లైమాక్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం.

  కథ:
  విజయ్ మోడీ (రాజేంద్రప్రసాద్) పచ్చి అవకాశవాది. తన పనుల కోసం ఎలాంటి అడ్డదారి తొక్కడనికైనా సిద్ధంగా ఉంటాడు. అలాగే ఓ మంత్రికి బినామీగా కూడా వ్యవహరిస్తుంటాడు. బ్యాంకుల నుంచి వేల కోట్లు రుణాలు తీసుకొని పెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదుగుతాడు. పేరు రావడం కోసం టీవీ షోలు చేయడంతో పాటు.. సినిమాలు కూడా నిర్మిస్తాడు. కానీ చివరకు విజయ్ మోడీ అప్పులపాలవుతాడు. బినామిగా మారిన తర్వాత మంత్రి నుంచి విజయ్ మోడీ ఎలాంటి సహాయం కోరుతాడు..? కష్టాల్లో ఉన్న సమయంలో ఓ అమ్మాయితో జరిగిన పరిచయం ఎక్కడికి దారి తీసింది..? మోడీ కేసులో సిఐడి అధికారులకు దొరికిన ప్రూఫ్ ఏంటి.. ఇలా మిగిలిన కథ క్లైమాక్స్.

  కథనం:
  క్లైమాక్స్ చిత్రం కోసం దర్శకుడు భవాని శంకర్ రాసుకున్న కథ బాగుంది. అయితే కథనంలో మాత్రం కొన్ని లోపాలు కనిపించాయి. దేశంలో పేరు పొందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్తను స్పూర్తిగా తీసుకుని ఈ కథ రాసుకున్నట్లు అర్థమవుతుంది. కానీ స్క్రీన్ ప్లే మరింత పట్టు సాధించి ఉంటే సినిమా రేంజ్ మారిపోయేది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ కొంచెం కన్‌ఫ్యూజన్ కలిగిస్తుంది. ఆ పాత్రను సరిగా తీర్చిదిద్దితే మరింత మంచి స్క్రిప్ట్ అయ్యేది. ఫస్టాఫ్ లో విజయ్ మోడీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికే కాస్త ఎక్కువ సమయమే తీసుకొన్నట్టు కనిపిస్తుంది. దాంతో కథ నెమ్మదిస్తుంది. సినిమా కేవలం గంటన్నర నిడివి అయినా ఫస్టాఫ్ సాగతీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక కథలో భాగంగా తనకు పరిచయమైన అమ్మాయిని కేవలం ఒకే ఒక రాత్రి కబుర్లు చెబితే కోటి రూపాయలు ఇస్తానని చెప్పే అంశాలు కాస్త హుషారును పుట్టిస్తాయి. అక్కడక్కడ ఆసక్తి కలిగించే సన్నివేశాలు ఉన్నా.. ఓవరాల్‌గా కామెడీతో పాటు థ్రిల్లింగ్ మూమెంట్స్.. సస్పెన్స్ చిత్రాలను ఆదరించే వాళ్లకు ఈ సినిమా నచ్చడానికి అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ లో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే క్లైమాక్స్ కచ్చితంగా మరింత ఆకట్టుకునేది.

  నటీనటులు:
  రాజేంద్రప్రసాద్ నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. విజయ్ మోడీగా రాజేంద్ర ప్రసాద్‌ అద్భుతంగా నటించారు. ఆయన గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. మోడీ పీఏగా నటించిన నాగరాజు క్యారెక్టర్‌కు బాగుంది. సెన్సేషనల్ శ్రీరెడ్డి తన నిజ జీవితం క్యారెక్టర్‌ను పోషించి ఆకట్టుకుంది. సినిమాలో ఆమె హీరోయిన్‌గా కనిపించింది. కానీ స్క్రీన్ టైమ్ చాలా తక్కువగా ఉంది. సాషా సింగ్, పృథ్వీ, శివశంకర్ మాస్టర్ తదితరులు ఫర్యాలేదనిపించారు.

  టెక్నికల్ టీం:
  రాజేష్ సంగీతం పర్లేదు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. రాజేంద్రప్రసాద్ ను విభిన్నమైన గెటప్లలో బాగానే ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ కాస్త వీక్. దర్శకుడు భవానీ శంకర్ కామెడీ, సస్సెన్స్ థ్రిల్లర్ అంశాలను జోడించి తన ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కానీ స్క్రీన్ పై మరింత పకడ్బందీగా ఉండుంటే క్లైమాక్స్ ఆకట్టుకునే విధంగా ఉండేది.

  చివరగా ఒక్కమాట:
  క్లైమాక్స్.. ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది..

  రేటింగ్: 2.5/5
  Published by:Kiran Kumar Thanjavur
  First published: