Home /News /movies /

CLASSMATES TURNS INTO BIG CELEBRITYS IN TOLLYWOOD AND BOLLYWOOD NR

celebrity classmates: ఒకప్పుడు క్లాస్‌మేట్లు.. ఇప్పుడు సెలబ్రెటీలు వీళ్ళే!

ram charan rana

ram charan rana

celebrity classmates: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల వ్యక్తిగత పరిచయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులకు బాగా ఆసక్తి చూపిస్తుంటారు.

    celebrity classmates: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటుల వ్యక్తిగత పరిచయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులకు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల నిజజీవితంలో జరిగిన సంఘటనలను, వాళ్ల అభిరుచులను ఇలా ఎన్నో రకాలుగా నటీ నటుల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఎంతో మంది నటులు తమ వ్యక్తిగత విషయాల గురించి అభిమానులకు ఏదో ఒక సందర్భంలో తెలుపుతుంటారు. ఇక తాజాగా సినీ ఇండస్ట్రీలో ఓకే క్లాస్ లో కలిసి చదువుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న విషయం తెలుస్తుంది.

    ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో సామాన్యుల నుండి రాజకీయ నాయకులు, నటీనటుల వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క విషయాలను సోషల్ మీడియా వేదికగా తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. అంతేకాకుండా నటీనటులు నెటిజనులతో తెగ ముచ్చటిస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సెలబ్రిటీలలో క్లాస్ మేట్స్ అన్న సంగతి కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసుకుందాం..

    టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈయన హైదరాబాద్ లో 'సెంట్ అల్ఫోన్సా' స్కూల్లో లో చదువుకున్నాడు. ఈయన మరో బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా అదే స్కూల్లో చదువుకోగా.. వీళ్లిద్దరు అప్పట్లో ఒకే క్లాస్ మేట్స్ అని తెలిసింది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని తెలిపారు.

    ఇక టాలీవుడ్ హీరోస్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి ఒకే స్కూల్లో చదువుకున్నారని ఓ సందర్భంలో వీళ్ళ మధ్య జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్ నటి అనుష్క శర్మ, ప్రముఖ క్రియేటర్ ధోని భార్య సాక్షి ధోని. వీరిద్దరూ చిన్నప్పుడు అస్సాంలో ఒకే స్కూల్లో ఓకే క్లాస్ లో కలిసి చదువుకున్నారట. ఇక మరో బాలీవుడ్ స్టార్ హీరోస్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు కూడా కలిసి ఒకే క్లాసులో చదువుకున్నారట. అంతేకాకుండా ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఓకే క్లాస్ మేట్స్ అని తెలిసింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Amir khan, Nani pradeep, Ram charan rana, Salman khan, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు