కులం పేరుతో వేధింపులు.. ప్రముఖ నటుడి సోదరుడు ఆత్మహత్యాయత్నం

కేరళ సంగీత నాటక అకాడమీపై సంచలన ఆరోపణలు చేస్తూ మోతాదు మించి నిద్రమాత్రలు మింగారు. తనపై కులం పేరుతో వేధిస్తున్నారని.. ప్రదర్శనలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని నాటక అకాడమీపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు రామకృష్ణన్.

news18-telugu
Updated: October 4, 2020, 10:52 PM IST
కులం పేరుతో వేధింపులు.. ప్రముఖ నటుడి సోదరుడు ఆత్మహత్యాయత్నం
R.L.V రామకృష్ణన్‌, కళాభవన్ మణి
  • Share this:
ప్రముఖ మోహినియట్టం కళకారుడు, నటుడు కళాభవన్ మణి సోదరుడు ఆర్.ఎల్.వీ.రామకృష్ణన్ శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. కేరళ సంగీత నాటక అకాడమీపై సంచలన ఆరోపణలు చేస్తూ మోతాదు మించి నిద్రమాత్రలు మింగారు. తనపై కులం పేరుతో వేధిస్తున్నారని.. ప్రదర్శనలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని నాటక అకాడమీపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు రామకృష్ణన్. త్రిస్సూర్‌లోని మణి స్మారక కేంద్రం వద్ద అపస్మారక స్థితిలో ఉన్న R.L.V రామకృష్ణన్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ICUలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామకృష్ణన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

క్లాసికల్ డాన్స్‌లో R.L.V రామకృష్ణన్‌ పీహెచ్‌డీ చేశారు. మోహినియట్టం కళను ఎక్కువగా మహిళలు ప్రదర్శిస్తుటారు. పురుషులు చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఆర్ఎల్‌వీ రామకృష్ణన్ కూడా ఒకరు. ఈ రంగంలో 15 ఏళ్ల పాటు పరిశోధన చేసి R.L.V రామకృష్ణన్‌ డాక్టరేట్ సంపాదించారు. అకాడమీలో వర్చువల్ ప్రదర్శనకు కేరళ సంగీత నాటక అకాడమీ ఛైర్ పర్సన్ K. P. A. C. లలిత అనుమతించినప్పటికీ కార్యదర్శి రాధాక్రిష్ణన్ నాయర్ అడ్డుకున్నాడని రామకృష్ణన్ ఆరోపించారు. కులం పేరుతో దూషిస్తూ.. తనను టార్చర్ పెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఐతే రామకృష్ణన్ గురించి లలిత, రాధాకృష్ణన్ మధ్య అసలు చర్చే జరగలేదని కేరళ సంగీత నాటక అకాడమీ ఓ ప్రకటనలో తెలిపింది. కానీ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను రామకృష్ణన్ కుటుంబ సభ్యులు మీడియాకు విడుదల చేశారు. కార్యదర్శి రాధాకృష్ణన్‌తో లలిత మాట్లాడినట్లు, ప్రదర్శన ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని రామకృష్ణన్‌కు సూచించినట్లు అందులో ఉంది. కళారంగంలో కుల వివక్షకు తావు ఉండకూడదని.. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని రామకృష్ణన్ కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా, ప్రముఖ దక్షిణాది నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ మణి తమ్ముడే ఈ R.L.V రామకృష్ణన్‌. కళాభవన్ మణి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడలో కలిపి సుమారు 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన 2016, మార్చి 6న కొచ్చిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. 45 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన శరీరంలో విషం ఆనవాళ్లు ఉండడంతో కేరళలో కళాభవన్ మృతి సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ.. ఇప్పటి వరకు ఆయన మరణం మిస్టరీ వీడలేదు.
Published by: Shiva Kumar Addula
First published: October 4, 2020, 10:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading