ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల మధ్య చిచ్చు పెడుతున్న దర్శకుడు..

నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ టాలీవుడ్‌లో ఎంత అన్యోన్యంగా ఉంటారో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి ఒకరి సినిమాల విషయంలో మరోకొరు ఎంతో కేరింగ్‌గా వ్యవహరిస్తూ వుంటారు. తాజాగా ఈ అన్నదమ్ముల మధ్య ఓ దర్శకుడు చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: February 13, 2020, 8:45 AM IST
ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల మధ్య చిచ్చు పెడుతున్న దర్శకుడు..
జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్
  • Share this:
నందమూరి బ్రదర్స్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ టాలీవుడ్‌లో ఎంత అన్యోన్యంగా ఉంటారో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి ఒకరి సినిమాల విషయంలో మరోకొరు ఎంతో కేరింగ్‌గా వ్యవహరిస్తూ వుంటారు. తాజాగా ఈ అన్నదమ్ముల మధ్య ఓ దర్శకుడు చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్, బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హీరోగా ఎన్టీఆర్‌కు ఇది 29వ సినిమా. ఈ చిత్రం తర్వాత తారక్.. తన 30వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి దాదాపు ఓకే చెప్పాడు. ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలే హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్,.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను అన్న కళ్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో చేస్తానని మాట ఇచ్చాడట.  కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో చేయమని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తారక్.. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో సంయుక్తంగా నిర్మించమని సలహా ఇచ్చాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం ఈ చిత్రాన్ని కేవలం హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో చేయమని ఎన్టీఆర్‌ పై ఒత్తిడి తెస్తున్నాడట. దీంతో ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్ రామ్‌కు తన 31వ సినిమాను నిర్మించమని కళ్యాణ్ రామ్‌ను కోరినట్టు సమాచారం.

entha manchivaadavuraa Movie Review,kalyan Ram,jr ntr,kalyan Ram entha manchivaadavuraa Movie Review,kalyan Ram,kalyan Ram mehreen kaur,Entha Manchi Vaadavura Twitter review,Entha Manchi Vaadavura,tollywood,telugu cinema,ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ,కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా మూవీ రివ్యూ,కళ్యాణ్ రామ్,మెహ్రీన్ కౌర్,సతీష్ వేగేశ్న,సతీష్ వేగేశ్న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా
కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్


కానీ కళ్యాణ్ రామ్‌కు మాత్రం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా నిర్మించాలనే కోరిక ఉందట. ఇప్పటికే ఎన్టీఆర్.. అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. వెట్రిమారన్‌తో చేయబోయే సినిమాకు కళ్యాణ్ రామ్‌ను ప్రొడ్యూసర్‌గా ఉండమని చెబుతున్నాడట. మరోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, అట్లీ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి.

Jr Ntr settled his Brother Kalayn Ram career with a valuable suggestion pk.. సాధార‌ణంగా పెద్ద‌ల మాట చిన్నోళ్లు వినాలంటారు. కానీ ఇక్క‌డ మాత్రం సీన్ రివ‌ర్స్‌లో జ‌రుగుతుంది. చిన్నోళ్ల మాట పెద్ద‌లు వింటున్నారు. త‌న అన్న‌య్య కోసం విలువైన స‌ల‌హాలు ఇస్తున్నాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఆయ‌న కెరీర్ కు మెంట‌ర్ అయిపోయాడు ఈయ‌న‌. jr ntr kalyan ram,jr ntr kalyan ram photos,jr ntr twitter,kalyan ram 118 movie review,jr ntr rrr movie shooting,kalyan ram movies,jr ntr suggestions to kalyan ram,kalyan ram ntr arts banner movies, telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్,కళ్యాణ్ రామ్ 118 రివ్యూ,కళ్యాణ్ రామ్‌ను సినిమాలు నిర్మించవద్దన్న జూనియర్ ఎన్టీఆర్,తెలుగు సినిమా
జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్


ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లాలంటే మరో రెండేళ్లు పట్టేటట్టు ఉండటంతో ముందుగా త్రివిక్రమ్, ఆ తర్వాత వెట్రిమారన్ సినిమాల తర్వాత కొరటాల, ప్రశాంత్ నీల్, అట్లీ సినిమాలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి కళ్యాణ్ తన సొంత సినిమాను వెట్రి మారన్‌తో తీయలేక తాను కోరుకున్న త్రివిక్రమ్, తారక్ కాంబినేషన్ కుదరక తెగ ఇబ్బందులు పడుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
First published: February 13, 2020, 8:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading