స్టార్ హీరో దంపతుల మధ్య ముదిరిన వివాదం.. విడిపోతున్నారా..?

గతంలోనూ దర్శన్ దంపతుల మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈసారి గొడవలు మరింత పెద్దవవుతున్నాయని ప్రచారం జరగడంతో.. ఇద్దరు విడిపోతారేమో అన్న చర్చ కూడా జరిగింది.

news18-telugu
Updated: August 14, 2019, 8:33 AM IST
స్టార్ హీరో దంపతుల మధ్య ముదిరిన వివాదం.. విడిపోతున్నారా..?
దర్శన్ విజయలక్ష్మి
  • Share this:
కన్నడ స్టార్ హీరో దర్శన్ దంపతులు ఎడమొహం,పెడమొహంగా ఉంటున్నారన్న ఊహాగానాలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర రూపం దాల్చడంతో.. ఒకరంటే ఒకరికి పడట్లేదన్న ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు సోమవారం ట్విట్టర్‌లో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం.. దానికి మరింత మసాలా దట్టించినట్టయింది. దర్శన్ సతీమణి విజయలక్ష్మి దర్శన్.. తన ట్విట్టర్ ఖాతా పేరులో నుంచి దర్శన్ పదాన్ని తొలగించడంతో.. ఇక ఇద్దరి మధ్య గొడవలు నిజమేనని చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే ఇంతలోనే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని విజయలక్ష్మి దర్శన్ ట్విట్టర్‌లో పేర్కొనడం గమనార్హం. తమపై జరుగుతున్న ప్రచారమంతా నిరాధారం అని దర్శన్ సతీమణి విజయలక్ష్మి దర్శన్ కొట్టిపారేశారు.

గతంలోనూ దర్శన్ దంపతుల మధ్య గొడవలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈసారి గొడవలు మరింత పెద్దవవుతున్నాయని ప్రచారం జరగడంతో.. ఇద్దరు విడిపోతారేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ విజయలక్ష్మి దర్శన్ ట్వీట్‌తో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది. ఇదిలా ఉంటే,దర్శన్ నటించిన 50వ చిత్రం కురుక్షేత్రం కన్నడలో సూపర్ హిట్ టాక్ అయింది. ఇటు తెలుగులోనూ సినిమాకు మంచి టాక్ రావడంతో దర్శన్ క్రేజ్ మరింత పెరిగింది. కురుక్షేత్రం ఇచ్చిన బూస్టింగ్‌తో మున్ముందు మరిన్ని సినిమాలు తెలుగులోకి డబ్ చేయాలని దర్శన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తరుణ్ సుధీర్ దర్శకత్వంలో దర్శన్ నటిస్తున్న రాబర్ట్ సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>