ఆ విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్లాష్..

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాలో ఓ విషయమై అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్లాష్ వచ్చిందట.

news18-telugu
Updated: February 12, 2020, 3:26 PM IST
ఆ విషయంలో అల్లు అర్జున్, సుకుమార్ మధ్య క్లాష్..
సుకుమార్, బన్నీ Photo : Twitter
  • Share this:
ఈ యేడాది అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచనల విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ కూడా కంప్లీటైంది. రెండో షెడ్యూల్‌ను ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను సుకుమార్ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో జబర్దస్త్ షో యాంకర్ అనసూయ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల తర్వాత కథను కీలక మలుపు తిప్పే పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో అనసూయ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాకు ‘శేషాచలం’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఈ టైటిల్‌‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారు.  'రంగస్థలం' లాంటి భారీ హిట్ తర్వాత కొత్త గ్యాప్ తీసుకున్న సుకుమార్.. ముందుగా మహేష్ బాబుతో చేద్దామనుకున్నాడు. ఎందుకో కథ సెట్ కాక.. అల్లు అర్జున్‌తో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు.

అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ప్రారంభం (Twitter/Photo)


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయంలో ఓ ఆసక్తికర న్యూస్ వైరల్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయంలో దర్శకుడు, హీరోల మధ్య క్లాష్ వచ్చిందట. దాంతో ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టు టాక్. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ హిట్ కావడానికి తమన్ మ్యూజిక్ కూడా పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఇందులో కొన్ని సాంగ్స్ దక్షిణాదిలో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాయంటే.. మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా అల్లు అర్జున్..సుకుమార్‌తో చేస్తోన్న సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ను తొలిగించి థమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకొనిమని ఒకటే పోరు పెడుతున్నాడట. ఇక దేవీ, అల్లు అర్జున్, సకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య 2 అప్పట్లో మ్యూజికల్ హిట్స్ .. అయితే ఈ మధ్యే దేవి ఎక్కువగా మ్యూజిక్ పై ఫోకస్ పెట్టకపోవడంతో పెద్దగా హిట్స్ పటడటం లేదు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్‌ని మార్చాలని కోరాడట అల్లు అర్జున్. కానీ సుకుమార్ మా్తరం దేవి శ్రీ ప్రసాద్‌తోనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాడట. మొత్తానికి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద రచ్చే నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ విషయమై అసలు నిజాలు ఏంటో తెలియాలంటూ సుకుమార్, బన్నిల్లో ఎవరు ఒకరు నోరు విప్పాల్సిందే.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 12, 2020, 2:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading