HOME »NEWS »MOVIE »clash between yash master and his wife due to monal gajjar mnj

Monal Gajjar: భార్య, భ‌ర్త మ‌ధ్య గొడ‌వ‌.. నాకేం సంబంధం లేదు మీరే చూసుకోండ‌న్న‌ మోనాల్ గ‌జ్జ‌ర్‌

Monal Gajjar: భార్య, భ‌ర్త మ‌ధ్య గొడ‌వ‌.. నాకేం సంబంధం లేదు మీరే చూసుకోండ‌న్న‌ మోనాల్ గ‌జ్జ‌ర్‌
instagram

మోనాల్ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతోన్న డ్యాన్స్ ప్ల‌స్ షోకు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్, అనీ మాస్ట‌ర్, ముమైత్ ఖాన్‌ల‌తో పాటు మోనాల్(Monal Gajjar) కూడా ఒక‌ జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే.

  • Share this:
    Monal Gajjar: బిగ్‌బాస్ 4లో పాల్గొని క్రేజ్ సంపాదించుకున్న వారిలో న‌టి మోనాల్ గ‌జ్జ‌ర్ ఒక‌రు. ఈ సీజ‌న్‌లో న‌ర్మ‌దా న‌దిగా పేరు తెచ్చుకున్న మోనాల్‌కి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత మాత్రం అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన అల్లుడు అదుర్స్‌లో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో మెరిశారు మోనాల్. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే మోనాల్ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప్ర‌సారం అవుతోన్న డ్యాన్స్ ప్ల‌స్ షోకు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్, య‌శ్ మాస్ట‌ర్, అనీ మాస్ట‌ర్, ముమైత్ ఖాన్‌ల‌తో పాటు మోనాల్ కూడా ఒక‌ జ‌డ్జిగా వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే. శనివారం, ఆదివారం ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతుంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రోమోను తాజాగా స్టార్ మా విడుద‌ల చేసింది.

    అందులో ఉప్పెనంత ఈ ప్రేమ‌కు పాట‌కు మోనాల్‌తో క‌లిసి స్టెప్పులు వేస్తారు య‌శ్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్. అదే స‌మ‌యంలో య‌శ్ మాస్ట‌ర్ భార్య వ‌ర్ష అక్కడ‌కు వ‌స్తుంది. అప్పుడు అనీ మాస్ట‌ర్.. చూశావా అని అడ‌గ్గా.. అంతా చూశాన‌ని వ‌ర్ష చెబుతుంది. ర‌ఘు మాస్ట‌ర్‌ని పిలిస్తే య‌శ్ మాస్ట‌ర్ ఎందుకు వెళ్లాడ‌ని అనీ మాస్ట‌ర్ ప్ర‌శ్నించింది. వెంట‌నే మోనాల్ నాకు ఏం సంబంధం లేదు. మీరే చూసుకోండి అని మోనాల్ అంటుంది. వెంట‌నే య‌శ్ మాస్ట‌ర్ సంబంధం లేదా అని అడుగుతాడు. వెంట‌నే వ‌ర్ష ఏడుపు మొదలుపెడుతుంది.ఇక వారి గొడ‌వ‌కు బాబా భాస్క‌ర్ మాస్ట‌ర్, ర‌ఘు మాస్ట‌ర్ ఆజ్యం పోస్తారు. మ‌ధ్య‌లో అనీ మాస్ట‌ర్ ఎంతైనా ప‌ప్పు ప‌ప్పే బిరియాని బిరియానినే అంటూ వ‌ర్ష,మోనాల్‌ల‌ను పోలుస్తోంది. ఫుల్ ఫ‌న్‌తో వ‌చ్చిన ఈ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక ఈ ఎపిసోడ్ శ‌నివారం ప్ర‌సారం కానుంది.

    Published by:Manjula S
    First published:January 05, 2021, 17:04 IST

    टॉप स्टोरीज