Home /News /movies /

CLASH BETWEEN BIGG BOSS TAMMANNA SIMHADRI AND TIKTOK UPPAL BALU MS

ఉప్పల్ బాలుతో రచ్చ.. టాలీవుడ్‌లోనూ 'గే'లు ఉన్నారని తమన్నా సంచలన కామెంట్స్

ఉప్పల్ బాలు, తమన్నా సింహాద్రి

ఉప్పల్ బాలు, తమన్నా సింహాద్రి

తమన్నా సింహాద్రి చేసిన వ్యాఖ్యలకు ఉప్పల్ బాలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా.. తమన్నా వ్యాఖ్యలపై స్పందించారు. 'నిజమే.. కుప్పిగంతులు వేసే సెలబ్రిటీ అయ్యాను.. నువ్వూ కుప్పిగంతులు వేసి నాలా పేరు తెచ్చుకో చూద్దాం..' అంటూ సవాల్ విసిరాడు.

ఇంకా చదవండి ...
  బిగ్‌బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి.. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టిక్‌టాక్ ఫేమ్ ఉప్పల్ బాలుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కుప్పిగంతులు వేయగానే సెలబ్రిటీ అయిపోరు అని బాలు టిక్‌టాక్ వీడియోలపై ఘాటుగా స్పందించారు. ఉప్పల్ బాలు చేష్టలు 'గే' కమ్యూనిటీని కించపరిచేలా ఉన్నాయని..వారి మనోభావాలను దెబ్బతీస్తున్నాడని అన్నారు. ఉప్పల్ బాలు నిజంగా ఫేమస్ కావాలనుకుంటే.. సొంతంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని.. అంతే తప్ప 'గే'ల మనోభావాలతో ఆటలాడవద్దని చెప్పారు. పేరు కోసం,డబ్బు కోసం 'గే'లాగా చేస్తూ.. ఆ కమ్యూనిటీని కించపరిస్తే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు. ఉప్పల్ బాలు నెల తక్కువ వాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్‌ను ఎట్రాక్ట్ చేయడానికే ఉప్పల్ బాలు అలా నటిస్తున్నాడని.. అతను గే కానప్పుడు అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించారు.

  తమన్నా సింహాద్రి చేసిన వ్యాఖ్యలకు ఉప్పల్ బాలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. టీవీ9 ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా.. తమన్నా వ్యాఖ్యలపై స్పందించారు. 'నిజమే.. కుప్పిగంతులు వేసే సెలబ్రిటీ అయ్యాను.. నువ్వూ కుప్పిగంతులు వేసి నాలా పేరు తెచ్చుకో చూద్దాం..' అంటూ సవాల్ విసిరాడు. తాను సెలబ్రిటీయా? అన్న ప్రశ్నిస్తున్న తమన్నా కూడా సెలబ్రిటీ కాదని గుర్తుచేశారు. ఏదో పని చేసుకుని బతుకుదామని హైదరాబాద్ వచ్చి ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న తనకు.. టిక్‌టాక్ వల్ల కొంత గుర్తింపు, డబ్బు వస్తున్నాయని.. దాన్ని చూసి ఓర్వలేకనే తమన్నా ఇలాంటి విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రముఖి లాంటి ట్రాన్స్‌జెండర్స్ తనకు మద్దతు నిలుస్తున్నారని చెప్పారు.

  టాలీవుడ్‌లోనూ'గే'లు ఉన్నారు : తమన్నా సింహాద్రి

  ఉప్పల్ బాలును విమర్శిస్తున్న క్రమంలో తమన్నా సింహాద్రి టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది 'గే'లు గోప్యతను పాటిస్తారని.. పబ్లిక్‌గా తాము 'గే' అని చెప్పుకోరని అన్నారు.అంతెందుకు.. ఫిలిం ఇండస్ట్రీలోనూ చాలామంది బడాబాబులు 'గే'లుగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప్పల్ బాలును టార్గెట్ చేయబోయి తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఇండస్ట్రీలో ఉన్న ఆ 'గే'లు ఎవరా? అన్న చర్చ మొదలైంది.
  Published by:Srinivas Mittapalli
  First published:

  Tags: Bigg Boss 3 Telugu, Tamanna simhadri, Tiktok, Tollywood, Uppal balu

  తదుపరి వార్తలు