Home /News /movies /

CITY CIVIL COURT ORDERS TO STOP RAJASEKHAR SEKHAR MOVIE SHOWS DUE TO FINANCE ISSUES HERE ARE THE DETAILS SR

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్‌లకు షాక్ ఇచ్చిన కోర్టు.. శేఖర్ సినిమా ప్రదర్శన ఆపాలంటూ ఆదేశాలు..

జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar Twitter)

జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar Twitter)

Shekar Movie : రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) దర్శకత్వంలో వచ్చిన శేఖర్ సినిమా ( Shekar Movie ) ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. డబ్బులు చెల్లించలేదంటూ ఈ సినిమా ఫైనాన్షియర్ కోర్టుకు వెళ్లడంతో హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది జీవితా రాజశేఖర్‌ల పరిస్థితి.

ఇంకా చదవండి ...
    Shekar Movie : రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ (Jeevitha Rajashekar) దర్శకత్వంలో వచ్చిన శేఖర్ సినిమా ( Shekar Movie ) ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. డబ్బులు చెల్లించలేదంటూ ఈ సినిమా ఫైనాన్షియర్ కోర్టుకు వెళ్లడంతో హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.  దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారింది జీవితా రాజశేఖర్‌ల పరిస్థితి. శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలని హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు ఆదేశించింది. దీంతో సినిమా ఆగిపోయింది. తనకు డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు డబ్బులు చెల్లించే వరకు సినిమా ప్రదర్శన ఆపాలంటూ తీర్పు ఇచ్చింది. సాయంత్రంలోపు రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది కోర్టు. ఈ క్రమంలో ఒకవేళా నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ సినిమా హక్కులన్నీ అటాచ్ చేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. శేఖర్ సినిమాను థియేటర్స్‌లోనే కాకుండా డిజిటల్, శాటిలైట్, ఓటీటీ యూట్యూబ్‌లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని పేర్కోంది. ఇక కోర్టు తీర్పుపై రాజశేఖర్ స్పందించారు. తన సినిమాను కొందరు కుట్ర ప్రకారం అడ్డుకుంటున్నారని ఆయన తన ట్వీట్‌లో పేర్కోన్నారు. ఎంతో కష్టపడి ‘శేఖర్’ సినిమా తెరకెక్కించామని.. సినిమానే తమ జీవితమని.. శేఖర్ సినిమా తమకు ఒక హోప్ లాంటిదని పేర్కొన్నారు.

    ఇక గతకొంతకాలంగా జీవితా రాజశేఖర్‌ దంపతులు వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. గరుడ వేగ సినిమా విషయంలోను ఇలాంటి ఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి కూడా ఓ ఫైనాన్షియర్ కోర్టు వరకు వెళ్లారు. ఇటీవల దీనికి సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు రాజశేఖర్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో సినిమా పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్ననేపథ్యంలో ఇలా జరగడంతో బాధపడుతున్నారు.


    ఇక శేఖర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా (Shekar) మూవీ మలయాళంలో హిట్టైన ఓ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు.  ఈ సినిమాలో రాజశేఖర్ సరసన ముస్కాన్ కూబ్‌చాందిని హీరోయిన్‌గా నటించారు. ఇందులో రాజశేఖర్ లుక్‌తో పాటు నటన బాగుంది. ఆమె కూతురుగా శివానీ యాక్ట్ చేయడం విశేషం.  ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ముస్కాన్, అను సితార కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర్‌కు హిట్ అనేది కంపల్సరీ. ఈ సినిమా కోసం రాజశేఖర్ 60 యేళ్ల వయసులో కొన్ని రిస్కీ షాట్స్ చేసినట్టు సమాచారం.

    Shekar Movie censor completed, Shekar Movie Review,Shekar,Shekar Movie Theatrical Trailer,Rajasekhar,Shekar Movie First Lyrical Kinnera Song Released,Dr Rajasekhar As Shekar,Shekhar First Glimse,Shekar Movie,Shekar Movie First Glimpse,Rajasekhar As Shekar Movie,Rajasekhar,marmaanuvu Title,marmaanuvu Rajasekhar,hero rajasekhar,rajasekhar,jeevitha rajasekhar,hero rajasekhar car accident,rajasekhar movies,hero rajasekhar car met with accident,rajasekhar car accident,rajasekhar speech,hero rajasekhar with media after car accident,chiranjeevi vs rajasekhar,rajasekhar daughters,chiranjeevi vs rajashekar,rajasekhar jeevitha,rajasekhar biography,rajasekhar suryudu movie,rajasekhar action scenes,hero rajasekhar car,chiranjeevi rajasekhar,tollywood,telugu cinema,రాజశేఖర్,రాజశేఖర్ జీవితా,రాజశేఖర్ హ్యాపీ బర్త్ డే,రాజశేఖర్ పుట్టినరోజు,రాజశేఖర్ హీరో,రాజశేఖర్ నట ప్రస్థానం,రాజశేఖర్ మర్మాణువు,మర్మాణువు,శేఖర్ మూవీ,రాజశేఖర్ శేఖర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌కు ముహూర్తం ఖరారు,శేఖర్ మూవీ ఫస్ట్ సింగిల్,రాజశేఖర్,శేఖర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్,శేఖర్ మూవీ రివ్యూ,శేఖర్ మూవీ ట్రైలర్ రివ్యూ
    Shekar Photo : Twitter


    ఇక ఈ సినిమా ఔట్ పుట్ పై రాజశేఖర్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడట. నిజానికి ‘గరుడవేగ’తో రాజశేఖర్ కి ఫుల్ క్రేజ్ వచ్చింది.కానీ, ఆ తర్వాత విడుదలైన ‘కల్కి’ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో రాజశేఖర్ ఈ శేఖర్ సినిమా పైనే ఆశలు అన్ని పెట్టుకున్నారు. మరోవైపు రాజశేఖర్  కిరణ్ అనే డైరెక్టర్ దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం అర్ధమవుతుంది.రాజశేఖర్.. వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’ అనే టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించడమే కాకుండా.. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ఒక పుర్రెకు తలపాగా చుట్టారు. ఈ  లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ఈ సినిమాను కూడా రాజశేఖర్ వేరే నిర్మాతలతో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Shekar Movie, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు