CINEMATOGRAPHER GOPAL REDDY BHARGAV EMOTIONAL ABOUT HIS FIRST MOVIE REVIEW IN ALITHO SARADAGA SHOW NR
Alitho Saradaga: ఆ రివ్యూ చూడగానే కన్నీళ్లు వచ్చాయ్.. ఎమోషనలైన సినిమాటోగ్రాఫర్!
alitho saradaga, gopal reddy
Alitho Saradaga: ఒక సినిమా విజయవంతం కావాలంటే కేవలం నటీనటులు ,దర్శకులు మాత్రమే కాకుండా, సినిమాకు సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. ఈ క్రమంలోనే ఒక సినిమా విజయంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది.
Alitho Saradaga: ఒక సినిమా విజయవంతం కావాలంటే కేవలం నటీనటులు ,దర్శకులు మాత్రమే కాకుండా, సినిమాకు సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. ఈ క్రమంలోనే ఒక సినిమా విజయంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా ఎంతో ఉంటుంది. ఈ విధంగా ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసి అద్భుతమైన విజయాలను అందుకున్న సినిమాటోగ్రాఫర్ ఎస్ .గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.తాజాగా గోపాల్ రెడ్డి బుల్లితెర ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చి తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాలను ముచ్చటించారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఈ కార్యక్రమంలో భాగంగా అలీ అడిగిన పలు ప్రశ్నలకు గోపాల్ రెడ్డి సమాధానాలను తెలుపుతూ ఎంతో సరదాగా ముచ్చటించారు. సినిమాటోగ్రాఫర్ గా గోపాల్ రెడ్డి చేసిన మొదటి చిత్రం "ముద్దమందారం". ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ అప్పట్లో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.ఈ సినిమా విడుదలైన తర్వాత రివ్యూ వచ్చింది. రివ్యూ చూడగానే కన్నీళ్ళు వచ్చాయి... "ఆ రివ్యూలో సినిమాలో అన్నీ బాగున్నాయి ..సినిమాటోగ్రఫీ తప్ప" అని రాసి ఉందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఈ కార్యక్రమం సందర్భంగా తన ప్రేమ పెళ్లి విషయాన్ని గురించి కూడా గోపాల్ రెడ్డి ముచ్చటించారు. "సిరిసిరిమువ్వ" సినిమా షూటింగ్ సమయంలో ఓ అమ్మాయిని చూశానని.. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలని భావించి ఆ అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్పడంతో అందుకు తన కూడా ఒప్పుకోవడంతో అలా పెళ్లి బంధం ద్వారా ఒక్కటయ్యానని ఈ సందర్భంగా తెలిపారు.
గోపాల్ రెడ్డి తన సినీ జీవితంలో ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేయడం మాత్రమే కాకుండా.. దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా చేపట్టి ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్నారు. తెలుగులో "వర్షం", "శ్రీరామదాసు"చిత్రాలకు గాను ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా 1983లో వచ్చిన ఆనందభైరవి, ఆ తరువాత క్షణం క్షణం, హలో బ్రదర్ వంటి సినిమాలకు నంది అవార్డులను దక్కించుకున్నారు.ఈ విధంగా గోపాల్ రెడ్డి తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఈ సందర్భంగా ముచ్చటించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.