Unlock 5.0 Guidelines: అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్.. కానీ కండీషన్స్ అప్లై..

థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)

Unlock 5.0 Guidelines: గత ఆర్నెళ్లుగా మూసుకుని ఉన్న సినిమా థియేటర్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. మార్చ్ 22 నుంచి థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. కరోనా వైరస్ కారణంగా వాటిని మూసేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

  • Share this:
గత ఆర్నెళ్లుగా మూసుకుని ఉన్న సినిమా థియేటర్స్ ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. మార్చ్ 22 నుంచి థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి. కరోనా వైరస్ కారణంగా వాటిని మూసేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాంతో అంతా ఈ సంగతి మరిచిపోయారు. ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత అన్ లాక్ 5.0 లో భాగంగా థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆర్నెళ్ళ తర్వాత రీ ఓపెనింగ్ చేసుకోవచ్చంటూ కేంద్రం గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే కేవలం 50 శాతం టికెట్స్ మాత్రమే అమ్ముకోవాలని కండీషన్ పెట్టింది. దానికి నిర్మాతలు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్, మాల్స్ అనే తేడా లేకుండా అన్నీ అక్టోబర్ 15 నుంచి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. అయితే కరోనా నిబంధనలు కూడా పక్కాగా పాటించాలని సూచించింది. దాంతో పాటు స్విమ్మింగ్ పూల్స్, పార్కులకు కూడా అక్టోబర్ 15 నుంచి అనుమతి ఇచ్చింది.
Published by:Praveen Kumar Vadla
First published: