నల్లమలుపు బుజ్జికి ఛాలెంజ్ విసిరిన దర్శకుడు వినాయక్..

ప్రస్తుతం తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప్రముఖులు చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే  కార్యక్రమం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: February 15, 2020, 2:45 PM IST
నల్లమలుపు బుజ్జికి ఛాలెంజ్ విసిరిన దర్శకుడు వినాయక్..
వినాయక్, నిర్మాత బుజ్జి
  • Share this:
ప్రస్తుతం తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప్రముఖులు చెట్లను నాటడంతో పాటు ఇతరులతో నాటించే  కార్యక్రమం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గాలి కాలుష్యాన్ని తగ్గించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అటవీ సంపదను పెంచి, కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో హరితహారం చేపడుతోంది. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులతో పాటు, సినీ, క్రీడ రంగాలకు చెందిన వారు.. సామాన్య ప్రజలు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కేటీఆర్, కవిత, సినీ ప్రముఖులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు క్రీడాకారులు సచిన్, లక్ష్మణ్, సైనా నెహ్వాల్, గోపిచంద్ వంటి ప్రముఖులంతా ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కల్ని నాటారు. తాజాగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ పాల్గొన్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు వినాయక్.  ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ  మనిషి బ్రతకడానికి మొక్కలు ఎంతో అవసరం అని అన్నారు. అంతేకాదు ఈ ఛాలెంజ్‌లో భాగంగా వినాయక్.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సినీ నిర్మాతలు నల్లమలపు బుజ్జి, మల్లిడి సత్యనారాయణ రెడ్డికి ఛాలెంజ్ విసురుతూ.. మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసిరాడు.

green india challenge,Director Vinayak participates in green india challenge,green india challenge,anchor suma's green india challenge,green challenge,winner rahul sipligunj accepts anchor suma's green india challenge,ntr green india challenge,suma about green india challenge,rahul sipligunj green india challenge,anchor suma about green india challenge,green indian challenge,anchor suma green india challenge,rahul sipligunj gave green india challenge,నల్లమల బుజ్జికి ఛాలెంజ్ విసిరిన దర్శకుడు వినాయక్,దర్శకుడు వినాయక్,గ్రీన్ ఛాలెంజ్,
వినాయక్, కాదంబరి కిరణ్


First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు