జబర్దస్త్ కమెడియన్‌తో గొడవ పడిన శేఖర్ మాస్టర్..

Sekhar Master: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 6:35 PM IST
జబర్దస్త్ కమెడియన్‌తో గొడవ పడిన శేఖర్ మాస్టర్..
జబర్దస్త్ కమెడియన్‌తో శేఖర్ మాస్టర్ గొడవ (Sekhar Master)
  • Share this:
శేఖర్ మాస్టర్ అంటే మనకు తెలియకుండానే కళ్ల ముందు కొన్ని స్టెప్పులు కనిపిస్తుంటాయి. టాప్ లేచిపోద్ది అన్నా ఆయనే.. అమ్మడు కుమ్ముడు అన్నా ఆయనే.. పిల్లా నువ్వులేని జీవితం అన్నా ఆయనే.. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ కొరియోగ్రఫర్ ఈయన. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఇప్పుడు ఆయనే కావాలంటున్నారు. ఒకప్పుడు ప్రభుదేవా, లారెన్స్ ఎలా అయితే దుమ్ము దులిపేసారో ఇప్పుడు శేఖర్ టైమ్ అలా నడుస్తుంది. వాళ్లు మెల్లగా కొరియోగ్రఫీ నుంచి నటన వైపు వచ్చారు.. ఇప్పుడు సీనియర్ల దారిలోనే నడుస్తున్నాడు శేఖర్ మాస్టర్ కూడా.
జబర్దస్త్ కమెడియన్‌తో శేఖర్ మాస్టర్ గొడవ (Sekhar Master)
జబర్దస్త్ కమెడియన్‌తో శేఖర్ మాస్టర్ గొడవ (Sekhar Master)

ఈయన కూడా ఇప్పుడు మెల్లమెల్లగా నటన వైపు అడుగులు వేస్తున్నాడు. ఇటు వైపు కూడా ఫోకస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. డాన్సుల వరకు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు నటన కూడా ఇరగదీస్తున్నాడు శేఖర్. ముఖ్యంగా ఈటీవీ డిజైన్ చేస్తున్న ప్రోగ్రామ్స్‌లో కామెడీ బ్రహ్మాండంగా పండిస్తున్నాడు ఈయన. ఢీలో సుధీర్‌పై పంచుల వర్షం కురిపించేస్తాడు శేఖర్. ఇక ఇప్పుడు ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ పండగ సర్ పండగ అంతేలో అదిరిపోయే కామెడీ స్కిట్ చేసాడు శేఖర్.

జబర్దస్త్ కమెడియన్‌తో శేఖర్ మాస్టర్ గొడవ (Sekhar Master)
జబర్దస్త్ కమెడియన్‌తో శేఖర్ మాస్టర్ గొడవ (Sekhar Master)

రాకెట్ రాఘవతో కలిసి ఈయన చేసిన స్కిట్ అదిరిపోయింది. ఇందులో శేఖర్ మాస్టర్ చేసిన కామెడీ చూస్తుంటే నవ్వుకోకుండా ఉండలేరు.. పైగా శేఖర్ మాస్టర్ నటనను చూసి నవ్వు ఆపుకోవడం కూడా కష్టమే. అయితే ఇదే స్కిట్‌లో రాకెట్ రాఘవతో గొడవ కూడా పడ్డాడు శేఖర్ మాస్టర్. మధ్యలో మా వాడు ఒకడు పనిపాట లేకుండా ఊళ్లో ఉన్నాడు.. తీసుకొచ్చి డాన్సులు నేర్పించండి మాస్టర్ అంటే ఏంటి రాఘవ నువ్వు అంటున్నది.. పనిపాట లేనోడు డాన్సర్ అవుతాడనా అంటూ సీరియస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత ప్రోమోకు ఈ డైలాగ్ సరిపోతుందా అంటూ కామెడీ చేసాడు. మొత్తానికి కొరియోగ్రఫర్‌గా మొదలు పెట్టి హీరోలైన లిస్టులో శేఖర్ మాస్టర్ కూడా త్వరలోనే చేరిపోయేలా కనిపిస్తున్నాడు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు