కొరియోగ్రాఫర్,ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్ బాబా భాస్కర్ అలీతో సరదాగా ఇంటర్వ్యూ ఇటీవల ఈటీవీలో ప్రసారమైంది. తన హుషారుకు తగ్గట్టే అలీ అడిగిన అన్ని ప్రశ్నలకు చలాకీ సమాధానాలు చెప్పారు భాస్కర్. ఇందులో భాగంగా యాంకర్ ఉదయభాను గురించి అలీ భాస్కర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అప్పట్లో ఓ యాంకర్ కోసం మీరు స్టూడియోలు చుట్టూ తిరిగేవారట.. ఎవరా యాంకర్? అని అడిగాడు. అయితే ఆ ప్రచారంలో నిజం లేదన్నాడు భాస్కర్. ఉదయ్ భాను, తాను కలిసి ఢీ2 షోకి యాంకరింగ్ చేశామని.. దాంతో కొంతమంది లేనిపోనివి అనుకునేవాళ్లని చెప్పారు. కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.ఉదయ్ భాను,తాను గాడ్&డెవిల్లా ఉండేవారమని చెప్పారు. ఉదయ్ భాను డెవిల్ అయితే తాను గాడ్ అని చెప్పారు.
అయితే ఢీ-2 షోలో తనకు, ఉదయ్ భానుకు మధ్య జరిగే సరదా గొడవలను తన భార్య మరోలా అర్థం చేసుకునేదని భాస్కర్ అన్నారు. 'ఎందుకు.. ఎప్పుడు ఆ అమ్మాయితో కలిసుంటావు,చేతులు పట్టుకుంటావు' అని తన భార్య అడిగేదన్నారు. అది డ్యాన్స్ షో కాబట్టి.. ఇద్దరం డ్యాన్స్ చేసేటప్పుడు సాధారణంగా చేతులు పట్టుకునేవాళ్లమని చెప్పారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అన్నారు. అయితే తాను కాస్త ఓవరాక్షన్ చేస్తున్నానని తన భార్య హెచ్చరించిందని.. అంతే తప్ప ఇంకేమీ లేదని ముగించేశారు.
Published by:Srinivas Mittapalli
First published:July 31, 2019, 14:52 IST