రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ‘గంట’ కొట్టిన విక్రమ్

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కళ్లు మహాభారత కథ మీదనే వున్నాయి. మరోవైపు...మహాభారతంల కీలక పాత్రధారి అయిన కర్ణుడి కథతో ఆర్.యస్.విమల్ అనే మలయాళ దర్శకుడు విక్రమ్ హీరోగా ‘మహావీర్ కర్ణ’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.

news18-telugu
Updated: December 4, 2018, 4:38 PM IST
రూ.300 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు ‘గంట’ కొట్టిన విక్రమ్
‘మహావీర్‌కర్ణ’ మూవీకి గంట కొట్టిన విక్రమ్
  • Share this:
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కళ్లు మహాభారత కథ మీదనే వున్నాయి. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ...వాసుదేవ నాయర్ మహాభారతాన్ని భీముని కోణంలో రాసిన ‘రండమూళం’ నవల ఆధారంగా ఒక సిన్మా చేస్తున్నారు. వీఏ శశికుమార్ మీనన్ అనే యాడ్ ఫిల్మ్ మేకర్ ఈ మహాభారతాన్ని రెండు పార్టులుగా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో యూఏఈకి చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి తెరకెక్కిస్తున్నాడు.

మరోవైపు...మహాభారతంల కీలక పాత్రధారి అయిన కర్ణుడి కథతో ఆర్.యస్.విమల్ అనే మలయాళ దర్శకుడు విక్రమ్ హీరోగా ‘మహావీర్ కర్ణ’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలో చిన్నప్పటి కర్ణుడిగా విక్రమ్‌ను పోలిన నటులు కావాలని ప్రకటనలు కూడా ఇచ్చారు.

‘మహావీర్ కర్ణ’మూవీ కాస్టింగ్ కాల్


తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు  తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ మూవీ యూనిట్ పూలతో అలంకరించిన ఒక గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మూవీలో ఈ గంటకు ఎంతో ప్రాముఖ్యత ఉందట. తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఈ గంటను రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌కు తరలించారు.‘మహావీర్ కర్ణ’ పూజా కార్యక్రమాలు


ఈ పూజా కార్యక్రమానికి ఈ మూవీ దర్శకుడు ఆర్.ఎస్.విమల్‌, మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపి సహా పలువురు హాజరైయ్యారు.

‘మహావీర్‌కర్ణ’ మూవీ పూజా కార్యక్రమాల్లో దర్శకుడు ఆర్.ఎస్.విమల్‌తో పాల్గొన్న సురేష్ గోపి
ఈ మూవీని ఒకేసారి హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో న్యూయార్క్‌కు చెందిన యునైటైడ్ ఫిల్మ్ కింగ్‌డమ్ సంస్థ వాళ్లు నిర్మిస్తున్నారు. మరోవైపు ‘మహావీర్‌కర్ణ’ను ప్రపంచంలోని 32 భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.

గంటకు ప్రత్యేక పూజలు నిర్వహించిన దర్శక, నిర్మాతలు


వివిధ భాషలకు చెందిన పలువురు అగ్ర నటులు ‘మహావీర్ కర్ణ’లో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారట.

దర్శకుడు ఆర్.ఎస్.విమల్‌తో విక్రమ్


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఆ తర్వాత నటీనటులను ఫైనలైజ్ చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ మూవీని సెట్స్ ‌పైకి తీసుకువెళతారట.
First published: December 4, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు