కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించారు. అంతకుముందు కోబ్రా సినిమాత ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే తాజాగా చియాన్ విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రానికి తంగలాన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఆయనకిది 61వ సినిమా. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పార్వతీ, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. పా రంజిత్ నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. వెలుగుల పండుగ దీపావళి పర్వదినం సందర్భంగా తంగలాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు.
ఇందులో చియాన్ విక్రమ్ రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన గతంలో ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ఇటీవలే ఈ సినిమా ఏపీలోని కడపలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుంది. పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - జీవీ ప్రకాష్ కుమార్, ఆర్ట్ - ఎస్ ఎస్ మూర్తి, ఎడిటింగ్ - ఆర్కే సెల్వ, స్టంట్స్ - స్టన్నర్ సామ్, బ్యానర్స్ - స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్, నిర్మాత - కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం - పా రంజిత్ అందిస్తున్నారు.
విక్రమ్ చేసిన ఐ, స్కెచ్, స్వామి స్క్వేర్.. ఇలా ఏవీ వర్కవుట్ కాలేదు. ఆయన అభిమానులు మాత్రం సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో విక్రమ్ నటించిన చిత్రం ‘కోబ్రా’ (Cobra)ప్రేక్షకుల ముందుకు వచ్చాడు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiyan Vikram, Kollywood News