హోమ్ /వార్తలు /సినిమా /

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ.. ఓటమే గెలుపుకు తొలిమెట్టు..

‘చిత్రలహరి’ మూవీ రివ్యూ.. ఓటమే గెలుపుకు తొలిమెట్టు..

చిత్రలహరి రివ్యూ

చిత్రలహరి రివ్యూ

కొన్నేళ్లుగా సాయి ధరమ్ తేజ్ సినిమా వచ్చిందంటే చాలు ఎలా ఉంది అని కూడా అడగడం మానేసి.. బాలేదు అని డిసైడ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందులో వాళ్ల తప్పు కూడా లేదు. అలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు సాయి. అయితే ఆరు ఫ్లాపుల తర్వాత ఇప్పుడు చిత్రలహరితో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సారి ఆయన మాయ చేసాడో లేదో చూద్దాం..

ఇంకా చదవండి ...

  రివ్యూ: చిత్రలహరి

  రేటింగ్: 2.75/5

  నటీనటులు: సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్, సునీల్, వెన్నెల కిషోర్

  ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

  సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

  నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

  దర్శకుడు: కిషోర్ తిరుమల


  కొన్నేళ్లుగా సాయి ధరమ్ తేజ్ సినిమా వచ్చిందంటే చాలు ఎలా ఉంది అని కూడా అడగడం మానేసి.. బాలేదు అని డిసైడ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందులో వాళ్ల తప్పు కూడా లేదు. అలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు సాయి. అయితే ఆరు ఫ్లాపుల తర్వాత ఇప్పుడు చిత్రలహరితో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సారి ఆయన మాయ చేసాడో లేదో చూద్దాం..


  కథ:

  సాయి తేజ్(విజయ్ కృష్ణ) ఇంజనీరింగ్ చేసి ఓ ప్రాజెక్ట్‌పై వర్క్ చేస్తుంటాడు. జీవితంలో సక్సెస్ అనేది లేకుండా ఫెయిల్యూర్స్‌తోనే కాలం గడిపేస్తుంటాడు. అలాంటి విజయ్ జీవితంలోకి లహరి(కళ్యాణి ప్రియదర్శన్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. కానీ అదే సమయంలో స్వేచ్ఛ(నివేదా పేతురాజ్) వీళ్లిద్దరి జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత విజయ్ ప్రేమను కాదని లహరి వెళ్లిపోతుంది. అప్పట్నుంచి తన ప్రేమను గెలిపించుకోడానికే కాకుండా కెరీర్‌లో గెలవడానికి కూడా ప్రయత్నిస్తుంటాడు విజయ్. మరి ఆ ప్రయత్నంలో విజయం ఎలా సాధించాడనేది కథ..


  కథనం:

  గెలిచేవాడు గెలిస్తే హెడ్ లైన్స్.. ఓడేవాడు గెలిస్తే హిస్టరీ.. ఒక్క ముక్కలో చెప్పాలంటే చిత్రలహరి కథ ఇదే. దీని చుట్టూనే కథ అల్లుకున్నాడు కిషోర్ తిరుమల. నిజం చెప్పాలంటే ఇలాంటి పాత్ర చేయడం సాయికి చాలా ఈజీ. ఎందుకంటే రియల్ లైఫ్‌లో కూడా సాయి ఇలాంటి పొజిషన్‌లోనే ఉన్నాడు. దాంతో వరస పరాజయాల్లో ఉన్నపుడు ఫెయిల్యూర్ కథ ఓకే చేసి ధైర్యం చేసాడు సాయి ధరమ్ తేజ్. ఇక కిషోర్ తిరుమల కూడా పక్కాగా సాయి ఇమేజ్ పక్కన బెట్టేసి తను అనుకున్న కథను చూపించాడు. వరసగా ఆరు ఫ్లాపులతో విసిగిపోయిన సాయి ధరమ్ తేజ్.. సరైన సమయంలో సరైన కథను ఓకే చేసాడేమో అనిపించింది చిత్రలహరి చూసిన తర్వాత ప్రేక్షకులకు. లేదంటే కిషోర్ తిరుమల కేవలం ఆయన కోసమే ఈ కథ రాసాడేమో అనిపిస్తుంది సినిమా చూసాక. అంతగా ఈ కారెక్టర్‌తో కనెక్ట్ అయిపోయాడు సాయి తేజ్.. ఫెయిల్యూర్ తప్ప గెలుపు తెలియని ఓ కుర్రాడి కథ.. అతడి కల.. ఆయన ప్రయాణం ఈ చిత్రలహరి. కథ పాతదే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తుంది.


  ఫస్టాఫ్ హీరో ప్రేమతో పాటు కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.. సెకండాఫ్ ఎమోషనల్ డ్రామాతో కాస్త స్లోగా సాగినట్లు అనిపించింది కానీ.. కిషోర్ తిరుమల దర్శకుడిగా కంటే రచయితగా తన సత్తా చూపించాడు. కెరీర్‌లో ఓడటం అంటే గెలవడానికి మరో ప్రయత్నం దొరికినట్లే అనేది బాగానే చూపించాడు. అందులోనే హీరో ప్రేమ.. ఎమోషన్.. అతడి గోల్స్.. గోల అన్నీ చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా డైలాగులతోనే మాయ చేసాడు కిషోర్ తిరుమల.. గుర్తుండిపోయే మాటలతో మాయ చేసాడు. చాలా కాలం తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి ఓ చూడదగ్గ సినిమా వచ్చిందనిపించింది చిత్రలహరి చూస్తుంటే. నటుడిగా కూడా ఆయన తన ఫెయిల్యూర్స్ నుంచి చాలా నేర్చుకున్నట్లు తెరపై కనిపించింది.. చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు.. సునీల్ కారెక్టర్ రీ ఎంట్రీలో తొలిసారి బాగా వచ్చింది. ఆయన నవ్వించాడు కూడా. అతడి కారెక్టర్ బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నిరాశ పరిచింది కానీ ఓరవాల్‌గా చూసుకుంటే మాత్రం చాలా రోజుల తర్వాత సాయి నుంచి మంచి సినిమా వచ్చిందనే ఫీల్ కలుగుతుంది.


  నటీనటులు:

  సాయి ధరమ్ తేజ్ బాగా నటించాడు. వరస పరాజయాలతో వచ్చిన కసో ఏమో తెలియదు కానీ అది ఆయన కళ్ళలో కూడా కనిపించింది. విజయ్ కారెక్టర్ అంత బాగా ఓన్ చేసుకున్నాడు. కళ్యాణి ప్రియదర్శన్ ఉన్నంత వరకు బాగా చేసింది. క్యూట్ యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకుంది. నివేదా పేతురాజ్ పాత్ర కాస్త డిఫెరెంట్‌గా అనిపించింది. సునీల్ చాలా ఏళ్ళ తర్వాత ఫుల్‌గా నవ్వించాడు. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపే అయినా నవ్వించాడు. పోసాని పాత్రతో తండ్రి ఎలా ఉంటాడో మరోసారి చూపించాడు దర్శకుడు కిషోర్. మిగిలిన వాళ్లంతా ఓకే..


  టెక్నికల్ టీం:

  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పరుగు పరుగు, ప్రేమ వెన్నెల పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నీట్‌గా అనిపించింది. అయితే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. సినిమాటోగ్రఫీ అందంగా ఉంది. ఇక దర్శకుడిగా కిషోర్ తిరుమల మరోసారి తన సెన్సిబులిటీస్ చూపించాడు. రచయితగా చాలా బాగా సక్సెస్ అయ్యాడు. కొన్ని గుర్తుండిపోయే మాటలు రాసాడు ఈయన. ఆయనలోని రైటర్.. డైరెక్టర్‌ను డామినేట్ చేసాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.


  చివరగా ఒక్కమాట:

  చిత్రలహరి.. ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఫెయిల్యూర్..


   

  First published:

  Tags: Kalyani Priyadarshan, Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు