ఒకటి రెండు కాదు.. ఏకంగా ఆరు ఫ్లాపులతో కెరీర్ పూర్తిగా వెనకబడిపోయాడు సాయి ధరమ్ తేజ్. తారాజువ్వలా వచ్చి.. అంతే వేగంగా కింద పడ్డాడు మెగా మేనల్లుడు. సుప్రీమ్ సినిమా తర్వాత ఒక్కటి కూడా హిట్ లేకపోవడంతో సాయి కెరీర్ చివరి దశకు వచ్చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమా చిత్రలహరి. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంతో తాను కోరుకున్న విజయం అందుకున్నాడు సాయి. పైగా తన పేరులోంచి ధరమ్ తీసి పక్కనబెట్టేసి సాయి తేజ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
ఈ సినిమాలో నివేదా పేతురాజ్, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 15 కోట్లు షేర్ వసూలు చేసింది. ఒకప్పుడు సుప్రీమ్ సినిమాతో 25 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించుకున్న సాయి తేజ్.. ఇప్పుడు మాత్రం 15 కోట్లతోనే సరిపెట్టుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 12.60 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ తీసుకొచ్చింది.
ఓవర్సీస్లో కోటి రూపాయలు మాత్రమే వసూలు చేసి అక్కడ నష్టాలు తీసుకొచ్చింది చిత్రలహరి. కానీ మిగిలిన అన్ని చోట్ల ఈ చిత్రం లాభాలు తీసుకొచ్చింది. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రం 40 లక్షలు నష్టం తీసుకొచ్చింది చిత్రలహరి. ఓవరాల్గా చిత్రలహరి సినిమా మూడు కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చి సాయి ధరమ్ తేజ్ కోరుకుంటున్న విజయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం చిత్రలహరి తీసుకొచ్చిన ఆనందంలో మరో మూడు సినిమాలకు కమిటయ్యాడు మెగా మేనల్లుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Devi Sri Prasad, Kalyani Priyadarshan, Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood