ఒకటి రెండు కాదు.. వరసగా ఆరు ఫ్లాపులు.. ఇన్ని ప్లాపులు వస్తే కనీసం ఆ హీరో సినిమా చూడ్డానికి కూడా ప్రేక్షకులు థియేటర్స్ వైపు రారు. కానీ సాయి ధరమ్ తేజ్ విషయంలో మాత్రం ఏదో అద్భుతం జరుగుతుంది. ఈయన గత సినిమాలతో పోలిస్తే ఈ సారి చిత్రలహరి సినిమా మాత్రం మంచి వసూళ్లు రాబడుతుంది. ముందు సినిమాల ప్రభావం కూడా దీనిపై పెద్దగా పడినట్లు కనిపించలేదు. మరీ సుప్రీమ్, సుబ్రమణ్యం ఫర్ సేల్ రేంజ్ కాకపోయినా మంచి వసూళ్లనే సాధిస్తుంది ఈ చిత్రం. దానికి తోడు అరడజన్ ఫ్లాపుల తర్వాత వచ్చింది కదా.. ఆ మాత్రం తక్కువ ఓపెనింగ్స్ వస్తాయి.
కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం తొలిరోజు 3 కోట్లు షేర్ తీసుకొచ్చింది. సాయి గత సినిమాలు ఫుల్ రన్లో 4 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. ఇలాంటి సమయంలో వచ్చిన చిత్రలహరి మంచి కలెక్షన్లు తీసుకొస్తుండటంతో గాల్లో తేలిపోతున్నాడు మెగా మేనల్లుడు. పైగా ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే తీసుకొస్తుంది.
సినిమా కాస్త స్లోగా ఉందనే టాక్ వినిపిస్తున్నా.. టాక్ మాత్రం బాగానే ఉండటంతో కలెక్షన్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా రెండు ఫ్లాపుల తర్వాత హిట్ అందుకున్నారు. మొత్తానికి ఈ చిత్రం చాలా మంది కెరీర్స్కు ప్రాణం పోస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Chitralahari Movie Review, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood