న్యూస్18తో ‘చిత్రలహరి’ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

గత కొన్నేళ్లుగా హిట్టు అన్నది ఎండమావిగా మారిన సాయి ధరమ్ తేజ్..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాపై సాయి ధరమ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

news18-telugu
Updated: April 10, 2019, 5:56 PM IST
న్యూస్18తో ‘చిత్రలహరి’ హీరో సాయి ధరమ్ తేజ్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
సాయి ధరమ్ తేజ్
  • Share this:
గత కొన్నేళ్లుగా హిట్టు అన్నది ఎండమావిగా మారిన సాయి ధరమ్ తేజ్..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. అప్పట్లో ప్రతి శుక్రవారం ప్రైమ్ టైమ్‌లో దూరదర్శన్‌లో వచ్చిన చిత్రలహరి ప్రోగ్రామ్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. ఇపుడు అదే ‘చిత్రలహరి’టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న ఈసినిమాపై ఆడియన్స్‌లో క్యూరియోసిటీ పెరిగింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందు రానుంది. ఈ సందర్భంగా ఈ  చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్ న్యూస్ 18కు ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.

  • వరుస పరాజయాలను ఎలా చూసారు. ఒక విజయం వచ్చినప్పుడు కాకుండా ఒక పరాజయం వచ్చినప్పుడు మన చుట్టూ జరిగే పరిణామాలు మనకు చాలా నేర్పుతాయి.  విజయానికి పరాజయానికి తేడా ఎంటో  ఈ సందర్భంగా తెలుసుకున్నాను. అందుకు అన్ని అంశాలపై చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. చిత్రలహరి సినిమా చాలా బాగా వచ్చింది అందరు మెచ్చే అంశాలు ఇందులో  ఉన్నాయి.

అందరు అనుకున్నట్లుగా వరస పరాజయాలు రావడం వలన పేరు మార్చుకుంటే కలిస్తోందని మార్చుకోలేదు. సాయి దరమ్ తేజ్‌లో ధరమ్  అనేది చాలా వైట్ ఉంది అందుకే సింపుల్ గా ఉండడానికి సాయి తేజ్ అని పెట్టుకున్నాను అంతే అందులో పెద్ద కారణం అంటూ లేదు.

  • క్రికెట్ అంటే చాలా ఇష్టమనుకుంటా..


నాకు అన్నింటి కంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం రోజు ఉదయం 7 గంటల కల్ల నేను గ్రౌండ్ లో ఉండాలి అంతే ....లేకపోతే ఉండలేను.

  • ఒక వేళ యాక్టర్ కాకపోతే..ఏమయ్యే వారు


నేను ఒక వేళ యాక్టర్‌ను కాకపోతే నిరుద్యోగిగా మిగిలిపోయే వాడినని అన్నారు సాయి దర్మమ్ తేజ్. దాంతో పాటు తనలో చిరంజీవి,పవన్ కళ్యాణ్ మామయ్య పోలికలు ఉంటటం నాకు కలిసొచ్చింది.

  • చిత్రలహరి సినిమా గురించి చెప్పండి..


ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో మళ్లీ తన ప్యాన్స్‌లో జోష్ నింపుతానన్నారు తేజ్. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌తో పాటు  పోసాని పాత్ర చాలా బాగుంటుందని సినిమా మొత్తానికి ఆయన క్యారెక్టరే హైలెట్.

  • జనసేన పార్టీకి మీరు ప్రచారం ఎందుకు చేయలేదు. 


పవన్ గారు నన్ను ప్రచారానికి రావోద్దని చెప్పారు ప్రస్తుతం నీ ఫోకస్ సినిమాలపై పెట్టమన్నారు. అందుకే ఎక్కడ ప్రచారంలో పాల్గొనలేకపోయాను.

  • సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారు. 


ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ....ఓటును అమ్ముకోకుండా అందరు తమ ఓటు హాక్కును నిజాయితిగా వినియోగించు కోవాలని కోరారు సాయి ధరమ్ తేజ్ సారీ  సాయితేజ్.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు