Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    చిరుకు అంత ధైర్యం ఎక్క‌డిది.. బాహుబ‌లే ఇచ్చాడా..?

    రాజ‌మౌళి వేసిన పునాదిపై సౌధాన్ని నిర్మించే ప‌నిలో బిజీగా ఉన్నారు మ‌న హీరోలు. ఇప్ప‌టికే "రంగ‌స్థ‌లం" లాంటి సినిమాలు 120 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి హిందీ ఇండ‌స్ట్రీకి మేమేం త‌క్కువ కాద‌ని నిరూపించుకున్నారు. ఇప్పుడు "సైరా"తో దాన్ని మ‌రో స్థాయికి చేర్చాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్.

    news18-telugu
    Updated: September 2, 2018, 2:52 PM IST
    చిరుకు అంత ధైర్యం ఎక్క‌డిది.. బాహుబ‌లే ఇచ్చాడా..?
    సైరా బాహుబలి ఫోటో
    • Share this:
    మూడేళ్ళ కిందివ‌ర‌కు తెలుగు సినిమా వేరు.. ఇప్పుడు వేరు. మ‌న సినిమా అంటే ఇప్పుడు ఇండియ‌న్ సినిమా అయింది. ఒక‌ప్పుడు ఇండియ‌న్ సినిమా అంటే హిందీ అనేవాళ్లు "బాహుబ‌లి" త‌ర్వాత తెలుగు సినిమా అంటున్నారు. దానికి త‌గ్గ‌ట్లే "బాహుబ‌లి" వేసిన పునాదిని మిగిలిన సినిమాలు కూడా కొన‌సాగిస్తున్నాయి. రాజ‌మౌళి వేసిన పునాదిపై సౌధాన్ని నిర్మించే ప‌నిలో బిజీగా ఉన్నారు మ‌న హీరోలు.

    Rangastalam
    రంగస్థలం


    ఇప్ప‌టికే "రంగ‌స్థ‌లం" లాంటి సినిమాలు 120 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసి హిందీ ఇండ‌స్ట్రీకి మేమేం త‌క్కువ కాద‌ని నిరూపించుకున్నారు. ఇప్పుడు "సైరా"తో దాన్ని మ‌రో స్థాయికి చేర్చాల‌ని చూస్తున్నాడు మెగాస్టార్. కొడుకు విసిరిన ఛాలెంజ్ భారీ తేడాతో దాటేయాల‌ని చూస్తున్నాడు చిరు. దానికి త‌గ్గ‌ట్లే ఇప్పుడు సైరాతో ర‌చ్చ చేస్తున్నాడు అన్న‌య్య‌. చిరంజీవి ఇప్పుడు రాజ‌కీయ నాయ‌కుడు కాదు.. ఈయ‌న పూర్తిగా మ‌ళ్లీ మెగాస్టార్ అయిపోయాడు.
    chiru
    చిరంజీవి బర్త్ డే వేడుకలు

    అందుకే "సైరా" సినిమా ముచ్చ‌ట్లు ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూనే ఉన్నాడు చిరంజీవి. దీనివెన‌క పెద్ద క‌థే ఉంది. ఈయ‌న చేస్తున్న‌ది చిన్న చిత్రం కాదు.. 200 కోట్ల‌తో బాలీవుడ్ సైతం బిత్త‌ర‌పోయేలా విజువల్ వండ‌ర్ చేస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని అదే స్థాయిలో తెర‌కెక్కిస్తున్నాడు. "సైరా" చూసిన త‌ర్వాత మ‌రో "బాహుబ‌లి" వ‌చ్చిందిరా అంటూ తెలుగు ఇండ‌స్ట్రీ కాల‌ర్ ఎగ‌రేసి చెప్పాల‌నేది చిరంజీవి క‌ల‌. పైగా ఈయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు కూడా.
    syeraa
    సైరా ట్విట్టర్ ఫోటో

    ఇక ఇప్పుడు మ‌రో ప్లాన్ కూడా ఈ సినిమా కోసం సిద్ధం చేస్తున్నాడు చిరంజీవి. "బాహుబ‌లి" మాదిరి విడుద‌ల‌కు ముందే చాలా వ‌ర‌కు విజువ‌ల్స్ విడుద‌ల చేస్తున్నాడు చిరంజీవి. "బాహుబ‌లి"కి కూడా అప్పుడు మేకింగ్ విజువ‌ల్స్ పేరుతో ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఓ విజువ‌ల్ రిలీజ్ చేస్తూ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి పెంచేసాడు రాజ‌మౌళి. ఇప్పుడు అమితాబ్ బ‌చ్చ‌న్.. సుదీప్.. విజ‌య్ సేతుప‌తి లాంటి స్టార్స్ ఉన్నారు కాబ‌ట్టి అన్ని భాష‌ల్లోనూ "సైరా"పై అంచ‌నాలు పెంచే ప‌నిలో ఉన్నాడు చిరంజీవి.


    అంద‌రి బ‌ర్త్డేలు వాడుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు విజువ‌ల్స్ విడుద‌ల చేస్తున్నాడు. ఇప్పుడు కూడా సుదీప్ బ‌ర్త్డే టీజ‌ర్ ఇలా తీసుకొచ్చిందే. ఆ మ‌ధ్య అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా చిరంజీవి లుక్ ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేయ‌డంతో నేష‌న‌ల్ వైడ్‌గా సైరాపై చ‌ర్చ జ‌రిగింది. మొత్తానికి ఇలా ప‌క్కా ప‌బ్లిసిటీతోనే ఈయ‌న "సైరా"ను ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. సినిమా వ‌చ్చే ఏడాది మేలో విడుద‌ల కానుంది.
    Published by: Praveen Kumar Vadla
    First published: September 2, 2018, 2:52 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading