Chiranjeevi - Ram Charan - Acharya : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేయనుంది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్దు పాత్ర దాదాపు గంట పాటు ఉండనుందట. ఆ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా.. రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు.
మరోవైపు ఈ సినిమా నిడివి 3 గంటలకి పైగా వచ్చిందట. దీంతో మూడు గంటల నిడివి బాగుంటుందా.. లేక బోర్ అనిపిస్తుందా.. అనే విషయంలో హీరో చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ తర్జనభర్జనలు పడుతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఓ ముప్పై నిమిషాల పాటు నిడివిని తగ్గిస్తే.. ఎలా ఉంటుందా అనే విషయంలో ఇద్దరి మధ్య చర్చ సాగుతోందట. అయితే ఈ (Acharya ) విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
RRR 18 Day WW Collections : ఆర్ఆర్ఆర్ 18 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. ఎంత కలెక్ట్ చేసిందంటే..
ఆచార్య చిరంజీవి 152వ సినిమా కాబట్టి.. ఈ సినిమాను ముందుగా థియేట్రికల్ ట్రైలర్‌ను సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు తెలంగాణ, ఏపీ సహా కర్ణాటక, తమిళనాడులో 152 థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత 7.02 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.
ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది.
ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acharya, Chiranjeevi, Kajal Aggarwal, Koratala siva, Pooja Hegde, Ram Charan