‘సైరా’లో కెవ్వు కేక పుట్టిస్తోన్న విజయ్ సేతుపతి లుక్..

Syeraa Narasimha Reddy..Vijay Sethupathi | ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ‘సైరా..నరసింహా రెడ్డి’. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ విజయ్ కొత్త లుక్‌తో కూడిన మోషన్ పోష్టర్‌ను రిలీజ్ చేసింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 16, 2019, 6:07 PM IST
‘సైరా’లో కెవ్వు కేక పుట్టిస్తోన్న విజయ్ సేతుపతి లుక్..
సైరా..నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి లుక్
  • Share this:
‘ఖైదీ నంబర్ 150’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ‘సైరా..నరసింహా రెడ్డి’. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటిస్తున్నారు.

మరోవైపు ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇంకోవైపు తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర యూనిట్ విజయ్ కొత్త లుక్‌తో కూడిన మోషన్ పోష్టర్‌ను రిలీజ్ చేసారు.




‘సైరా’లో విజయ్ సేతుపతి విజయ్ రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నాడు. జులపాల జుట్టుతో విజయ్ సేతుపతి లుక్ టెర్రిఫిక్‌గా ఉంది.

chiranjeevi's Syeraa Narasimha Reddy Movie Vijay Sethupathi Look Released ‘సైరా’లో కెవ్వు కేక పుట్టిస్తోన్న విజయ్ సేతుపతి లుక్..
సైరా..నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి లుక్


రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కోతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సమ్మర్‌ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పంద్రాగష్టు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

కథానాయకుడి టీమ్‌తో క్రిష్ చిట్‌చాట్


ఇవి కూడా చదవండి 

’మహానాయకుడు’ కోసం ప్లాన్ బి రెడీ చేస్తోన్న బాలయ్య అండ్ టీమ్

మహేష్‌కు అల్లు అర్జున్ రిటర్న్ గిఫ్ట్..దేనికో తెలుసా..

టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్
Published by: Kiran Kumar Thanjavur
First published: January 16, 2019, 5:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading