ప్రస్తుతం చిరంజీవి..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా..నరసింహారెడ్డి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీటైంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. మరోవైపు సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నటిస్తోంది. తమన్నా సెకండ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. సైరాకు బాలీవుడ్ చిత్ర సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి
ఏడాదిన్నర క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా... ఇప్పటికీ సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటుండటంపై మెగా అభిమానుల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. సినిమాను ఎలాగైనా దసరా నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న చిరంజీవి, చిత్ర నిర్మాత రామ్ చరణ్... దర్శకుడు సురేందర్ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకే సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే జపాన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న చిరంజీవి..ఇపుడు కేరళకు వెళతున్నట్టు సమాచారం. ఈ కేరళ షెడ్యూల్లో సినిమాకు కీలకమైన పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత హైదారాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత ‘సైరా’ సినిమా షూటింగ్ పూర్తైవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

చిరంజీవి, సురేందర్ రెడ్డి
తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఉయ్యాలవాడ..బ్రిటిష్ వారితో చేసిన గెరిల్లా పోరాటలే హైలెట్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా పోరాట సన్నివేశాలకే బడ్జెట్లో 25 శాతం కేటాయించారని తెలుస్తోంది. మరి ఈ సినిమా తర్వాత చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గొంటారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 16, 2019, 08:01 IST