అవును మెగా బ్రదర్స్ .. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసిన ఈ ఫోటో బావగారూ బాగున్నారా వంద రోజుల వేడుక సందర్భంగా తీసినది. ఇక బావగారు బాగున్నారా సినిమా టైటిల్ విషయానికొస్తే.. మాస్టర్ సినిమాలో బాగున్నారా.. బాగున్నారా అంటూ బావగారూ బాగున్నారా అంటూ ఓ పాట ఉంది. ఆ పాట పల్లవిలోని చరణం తీసుకొని ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు. చిరంజీవి ‘బిగ్‌బాస్’, ‘రిక్షావోడు’ వంటి డిజాస్టర్స్ తర్వాత ఒక యేడాది గ్యాప్ తీసుకొని ‘హిట్లర్’ సినిమాతో ముందుకొచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత ‘మాస్టర్’ సినిమా కూడా హిట్టైయింది. ఈ రెండు సినిమాల్లో చిరంజీవి కాస్త గంభీరమైన పాత్రలే చేసాడు. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఉండాలని జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో పరుచూరి బ్రదర్స్ రచనలో తమ్ముడు నాగబాబుకు చెందిన అంజనా ప్రొడక్షన్స్‌లో చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమా చేసారు.
చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ (File/Photo)
ఈ చిత్రంలో రంభ, రచన హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడమే కాదు. మ్యూజికల్‌గా మంచి హిట్టైయింది. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం కూడా ఇదే. ఇక నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగబాబు నిర్మించిన చిత్రాల్లో హిట్ అనిపించుకున్న ఏకైక చిత్రం కూడా ‘బావగారూ బాగున్నారా’ మాత్రమే. ఈ సినిమాలో చిరంజీవి పెద్ద కొండపై నుంచి తాళ్లు కట్టుకొని లోయలోకి బంగీ జంప్ అనే సాహసం చేసారు. ఈ సినిమాలో చిరంజీవి కనిపించే ఫస్ట్ షాట్ ఇదే. ఈ సినిమాలో సారీ సారీ అనే పాటలో నాగబాబు గెస్ట్‌గా కనిపించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, శ్రీహరిల కామెడీ హైలెట్. ఈ సినిమాను హిందీలో అల్లు అరవింద్.. గోవిందా హీరోగా ‘కువారా’ పేరుతో రీమేక్ చేసారు. బంగ్లాదేశ్‌లో ‘జమై షషూర్’ పేరుతో రీమేకైంది. ఈ చిత్రం వంద రోజుల వేడుకలో మెగా బ్రదర్స్ ముగ్గురు ఒకే వేదికపై మెరిసారు. రీసెంట్గా ఈ సినిమా 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.