చిరంజీవికి కృష్ణపై ఎంత అభిమానమంటే... ఈ ట్వీట్ చూస్తే చాలు...

మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: May 31, 2020, 2:48 PM IST
చిరంజీవికి కృష్ణపై ఎంత అభిమానమంటే... ఈ ట్వీట్ చూస్తే చాలు...
చిరంజీవి, కృష్ణ Photo : Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తన సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా కృష్ణకు బర్త్ డే విషేస్ తెలుపుతూ.. కృష్ణ అరుదైన అఛీవ్మెంట్స్ ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి రాస్తూ.. ”కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు, నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70ఎం ఎం చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదినశుభాకాంక్షలు” అంటూ కృష్ణ సాధించిన, చేసిన సాహసాలను కొనియాడుతూ పోస్ట్ పెట్టారు. సూపర్ స్టార్ కృష్ణపై చిరంజీవి తనకున్న అభిమానాన్ని ట్వీట్ రూపంలో ఎంతో హృద్యంగా తెలియజేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి కృష్ణతో దిగిన ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్, గౌతమ్, ఆయన కోడలు నమ్రతతో పాటు పలువురు సినీ సెలెబ్రీటీస్ ఆయనకు బర్త్ డే విషేస్ తెలిపారు.











Published by: Suresh Rachamalla
First published: May 31, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading