హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi | Waltair Veerayya : పాటల కోసం యూరప్ వెళ్లిన వాల్తేరు వీరయ్య.. 15 రోజులు అక్కడే..

Chiranjeevi | Waltair Veerayya : పాటల కోసం యూరప్ వెళ్లిన వాల్తేరు వీరయ్య.. 15 రోజులు అక్కడే..

Waltair Veerayya Photo : Twitter

Waltair Veerayya Photo : Twitter

Chiranjeevi | Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన చిరంజీవి వచ్చే యేడాది మూడు నాలుగు సినిమాలతో రెడీగా ఉన్నారు. ఇందులో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Chiranjeevi | Waltair Veerayya:  ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya).  చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌ చేస్తున్నారు. శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా చేస్తోంది.  సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది టీమ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా (Waltair Veerayya Release date) జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో.. ఇక అది అలా ఉంటే వీరయ్య టీమ్ తాజాగా యూరప్ వెళ్లింది. దీనికి సంబంధించి చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ఓ వైపు ఫ్యామిలీతో పాటు విహార యాత్ర, మరోవైపు హీరోయిన్‌తో వీరయ్య యాత్ర అంటూ ట్వీటారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా పాటల కోసం యూరప్ వెళ్లింది. అక్కడే ఓ 15 నుంచి 20 రోజులు ఉండి.. పాటలను చిత్రీకరణించనున్నారట. రెండు పాటలను యూరప్‌లోనే షూట్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుందని అంటున్నారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘బాస్’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలాతో చిరు చిందేసారు. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్‌లో ఓ రేంజ్‌లో ఉన్నాడు. అభిమానులు ఈ కటౌట్‌ చూసి ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు.  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా త‌దిత‌రులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో పాత్రలో నటించారు.  మంచి కంటెంట్ ఉన్న ఎందుకో ఈ సినిమా అనుకున్నరేంజ్‌ల ో కలెక్షన్స్‌ను మాత్రం అందుకోలేకపోయింది.

First published:

Tags: Chiranjeevi, Tollywood news, Waltair Veerayya

ఉత్తమ కథలు