Chiranjeevi | Waltair Veerayya: ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా వాల్తేరు వీరయ్య. చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు బాబీ డైరెక్షన్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది టీమ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి. చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో..
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన ‘బాస్’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలాతో చిరు చిందేసారు. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్‌లో ఓ రేంజ్లో ఉన్నాడు. అభిమానులు ఈ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.
This Sankranthi, it's time for the MASS MOOLAVIRAT darshanam in theatres ????#WaltairVeerayya GRAND RELEASE WORLDWIDE on 13th JAN, 2023 ????
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @CatherineTresa1 @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @SonyMusicSouth pic.twitter.com/Z7aiNFxOax — Mythri Movie Makers (@MythriOfficial) December 7, 2022
మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన మరో లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో పాత్రలో నటించారు. మంచి కంటెంట్ ఉన్న ఎందుకో ఈ సినిమా అనుకున్నరేంజ్ల ో కలెక్షన్స్‌ను మాత్రం అందుకోలేకపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Waltair Veerayya