మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. యంగ్ దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టీంకు ఏపీలోని జగన్ సర్కారు షాక్ మీద షాక్ ఇస్తుంది. జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విశాఖ నగరం ఆతిథ్యమిస్తోంది. వేదిక మార్పు నేపథ్యంలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ నిర్వహణలో మాత్రం మొదటి నుంచి కూడా గందరగోళం ఏర్పడింది. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మరోసారి మారింది. ఇప్పటికే మూడుసార్లు వేదికను మార్చారు అధికారులు. ట్రాఫిక్ జామ్, రద్దీ అంటూ.. ఇప్పటికే వేదికను మారుస్తూకు మార్చారు. అధికారులు చిరంజీవి టీంకు తికమకపెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ఆర్కీ బీచ్ నుంచి వేదికను... ఏయూ గ్రౌండ్స్‌కు మార్చారు.
మొదట విశాఖలో ఆర్కేబీచ్ అని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు మార్చారు. మళ్లీ ఆర్కే బీచ్‌కు మార్చారు. ఇప్పుడు పోలీసులు అక్కడ కూడా ఈవెంట్ నిర్వహించడానికి వీలు లేదని అంటున్నారు. ఆర్కే బీచ్‌లో ప్రీ రిలీజ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో వాల్తేరు వీరయ్య టీం ఇప్పటికే ఆర్కే బీచ్‌లో ఏర్పాట్లు ప్రారంభించింది. దీంతో మరోసారి వేదిక మార్పు అనగానే... ఆర్కే బీచ్ నుంచి ఏయూ గ్రౌండ్స్‌కు తరలి వెళ్తున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవీకి కాల్ చేసి వైజాగ్ సీపీ చెప్పారని సమాచారం. ఆర్కే బీచ్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుందని.. ఎక్కవమంది వస్తే వారిని కంట్రోల్ చేయడం కష్టమని అంటున్నారు పోలీసులు. ప్రాణ నష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.అయిదే ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య ప్రి రిలీజ్ ఈవెంట్ తేదీ కూడా మార్చినట్లు చెబుతున్నారు. రేపు కానీ.. లేదంటే ఎల్లుండు అయినా ఈవెంట్ నిర్వహించవచ్చని చెబుతున్నారు. తాజాగా ఇప్పుడు ఏయూ గ్రౌండ్స్‌లోనే ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మెగా అభిమానులు మాత్రం జగన్ సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సార్లు వేదికను మార్చడం ఏంటని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm jagan, Chiranjeevi, Vizag, Waltair Veerayya