Chiranjeevi - Waltair Veerayya: ఈ యేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాల తర్వాత చిరంజీవి (Chiranjeevi) తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు (తెగింపు) సినిమాలున్నాయి..చూడాలి మరి ఈ సంక్రాంతి పోరులో ఏ సినిమా పండుగకు విజేతగా నిలవనుందో.. ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేసింది టీమ్. 'నువ్వు శ్రీదేవైతే నేను చిరంజీవి అవుతా' అంటూ సాగే ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఈ మెలోడియస్ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ రాయగా.. జస్ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్ పాడారు.
ఈ సినిమా నుంచి విడుదలైన బాస్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో చిరుతో ఊర్వశి రౌతెలా చిందేసింది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ వీరయ్యను రేపు (సోమ వారం) విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
#VeerayyaTitleSong out tomorrow ????#WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th pic.twitter.com/qS5Wh1sPHr
— Mythri Movie Makers (@MythriOfficial) December 25, 2022
ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. అభిమానులు ఈ కటౌట్ చూసి ఫిదా అవుతున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) కీలకపాత్రలో పాత్రలో నటించిన పెద్ద ఒరిగిందేమి లేదు. మలయాళంలో లాగా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత (Sumalatha) కనిపించనున్నారట.
చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాను సవతి సోదరుల నేపథ్యంలో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Shruti haasan, Tollywood, Waltair Veerayya