హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi | Waltair Veerayya: ట్రోలింగ్ అవుతోన్న వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ ప్రోమో సాంగ్‌..

Chiranjeevi | Waltair Veerayya: ట్రోలింగ్ అవుతోన్న వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ ప్రోమో సాంగ్‌..

Boss Party Song Photo : Twitter

Boss Party Song Photo : Twitter

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒకటి రెండు కాదు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ షూటింగ్ చేసుకుంటున్నాయి.ఈ యేడాది ఇప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించిన చిరంజీవి వచ్చే యేడాది మూడు సినిమాలతో రెడీగా ఉన్నారు. అందులో భాగంగా బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మాస్ పాటకు చెందిన ప్రోమోను విడుదల చేసింది టీమ్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి (Chiranjeevi) తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళీ సందర్భంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానున్నట్లు ప్రకటించింది టీమ్.  సంక్రాంతి కానుకగా ప్రకటించడంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం టీమ్ హైదరాబాద్ సిటీ శివార్లలో భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా నటించనుందని.. ఈ స్పెషల్ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో బాస్ పార్టీ (Boss Party) అంటూ తొలి పాటను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు టీమ్. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్‌లో ఓ రేంజ్‌లో ఉన్నాడు. అభిమానులు ఈ కటౌట్‌ చూసి ఫిదా అవతున్నారు.

ఇక అది అలా ఉంటే తాజాగా టీమ్ ఈ పాటకు సంబంధించిన ప్రోమోను (Boss Party Promo) విడుదల చేసింది. అయితే ప్రోమో విషయంలో ఫ్యాన్స్ కాస్తా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాట కామెడీగా ఉందని అంటున్నారు. ఇక కొందరు నెటిజన్స్ ఏకంగా పాటను ట్రోల్ చేస్తున్నారు. ఈ పాట ఏంటీ ఇలా ఉందంటున్నారు. ఏది ఏమైనా పాటకు రావాల్సిన పబ్లిసిటీ మాత్రం వచ్చింది. ఇక పూర్తి పాట వినాలి అంటే రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల వరకు ఆగాల్సిందే.

రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5, 2022న థియేటర్లలో గ్రాండ్ రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో పాత్రలో నటించిన పెద్ద ఒరిగిందేమి లేదు. మలయాళంలో లాగా పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. ఇప్పటికే శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారట. అందులో భాగంగానే శృతిహాసన్‌తో పాటు సుమలత నటించనున్నారని అంటున్నారు.

ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుంది. సంక్రాంతికి ఇప్పటికే తెలుగులో బాలయ్య 107, వీరసింహారెడ్డి కూడా వస్తోంది. అఖిల్ అక్కినేని ఏజెంట్, విజయ్ వారసుడు..  సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. చిరంజీవి 154, బాలయ్య 107లను నిర్మించేది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చూడాలి మరి ఏం జరుగనుందో..  ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా త‌దిత‌రులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

First published:

Tags: Chiranjeevi, Tollywood news, Waltair Veerayya

ఉత్తమ కథలు