Chiranjeevi - Waltair Veerayya :మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. గత నెల 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 136.04 కోట్ల షేర్ ( రూ. 232.40 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఇక నైజాం (తెలంగాణ)లో దాదాపు రూ. 36 కోట్ల షేర్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. అంతేకాదు చిరు కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఖైదీ నంబర్ 150 తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవికి దక్కిన రెండో అతి పెద్ద విజయం ఇదే. ఈ మధ్య విడుదలైన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు నిరాశ పరిచినా.. వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన నట విశ్వరూపం చూపించి కలెక్షన్లు కొల్లగొట్టాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన ఓ రియల్ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు చిరంజీవి . ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమా ఇంటర్వెల్ సీన్‌లో మలేషియాలో విలన్ బాబీ సింహాను ఏనుగు సీక్వెన్స్‌లో చంపే సీన్ హైలెట్‌గా నిలిచింది. తాజాగా రియల్ లైఫ్‌లో ఓ ఏనుగు కారుపై ఎక్కిన రియల్ సీన్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసారు.
View this post on Instagram
వాల్తేరు వీరయ్య రెగ్యులర్ చిరంజీవి మార్క్ సినిమాగా అభిమానుల్లో దూసుకుపోతుంది. మెగాస్టార్ నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అవన్ని ఈ సినిమాలో సమపాళ్లతో ఉన్నాయి. దీంతో అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి ప్రదర్శించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో తన ఏజ్‌కు తగ్గ పాత్రలను చేసిన చిరంజీవి.. ‘వాల్తేరు వీరయ్య’లో ఔట్ అండ్ ఔట్ ఊర మాస్ వీరయ్యగా ప్రేక్షక నీరాజనాలు అందుకున్నారు. దాదాపు అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపుకు వచ్చింది. ఈ సినిమా ఈ నెల 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
తన నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అవన్ని ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వాల్తేరు వీరయ్య సినిమా 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా ఈ యేడాది మన తెలుగులోనే కాదు.. దేశంలోనే తొలి హిట్ నమోదు చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Tollywood, Waltair Veerayya