హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi Vs Rajinikanth: చిరంజీవి వర్సెస్ రజినీకాంత్ .. దీపావళి రేసులో తలైవా ‘అన్నాత్తే’ తో ఢీ అనబోతున్న మెగాస్టార్ ఆచార్య.. ?

Chiranjeevi Vs Rajinikanth: చిరంజీవి వర్సెస్ రజినీకాంత్ .. దీపావళి రేసులో తలైవా ‘అన్నాత్తే’ తో ఢీ అనబోతున్న మెగాస్టార్ ఆచార్య.. ?

చిరంజీవి ‘ఆచార్య’ వర్సెస్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ (Twitter/Photo)

చిరంజీవి ‘ఆచార్య’ వర్సెస్ రజినీకాంత్ ‘అన్నాత్తే’ (Twitter/Photo)

Chiranjeevi Vs Rajinikanth: చిరంజీవి (Chiranjeevi) వర్సెస్ రజినీకాంత్ (Rajinikanth).. దీపావళి రేసులో తలైవా మూవీ  ‘అన్నాత్తే’(Annaatthe) తో ఢీ అనబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య (Acharya) మూవీ. వివరాల్లోకి వెళితే.. 

  Chiranjeevi Vs Rajinikanth: చిరంజీవి (Chiranjeevi) వర్సెస్ రజినీకాంత్ (Rajinikanth).. దీపావళి రేసులో తలైవా మూవీ  ‘అన్నాత్తే’(Annaatthe) తో ఢీ అనబోతున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య (Acharya) మూవీ. వివరాల్లోకి వెళితే..  మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ ముందుగా మే 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా ఆ సమయానికి కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో ఈ సినిమా షూటింగ్‌తో పాటు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది. ఐతే.. చిరు బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ విడుదల తేదిని ప్రకటిస్తారని అందరు అనుకున్నారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసారు. ముందుగా వినాయక చవితికి అనుకున్నా.. ఎందుకో కుదరలేదు.

  ఇక దసరా రేసులో వద్దామనుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఉంది. కానీ ఈ సినిమాను వచ్చే యేడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది.  రీసెంట్‌గా బాలీవుడ్‌లో విడుదలైన సినిమాలేవి పెద్దగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని రాజమౌళి ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ మంచి సీజన్‌లో విడుదల చేద్దామనే ఆలోచనలో ఉన్నారు.

  NBK Piasa Vasool@4 Years : బాలయ్య, పూరీ జగన్నాథ్‌ల ‘పైసా వసూల్’కు 4 యేళ్లు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..


  ఇక దసరా రేసులో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీతో పాటు ‘అఖండ’ మూవీలు రిలీజ్ కానున్నట్టు సమాచారం. దీంతో చిరంజీవి తన సినిమాను దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే దసరాతో పాటు దీపావళి, సంక్రాంతి సీజన్స్‌లలో అందరు హీరోలు కర్చీఫ్‌లు వేసేసారు. ఈ నేపథ్యంలో చిరు.. తన సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  చిరంజీవి, రజినీకాంత్ (Twitter/Photo)

  ఇప్పటికే దీపావళికి రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పైగా మెగాస్టార్ రంగంలోకి దిగితే.. మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ ఎలా ఉంటుందనేది అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఇక రజినీకాంత్ ‘అన్నాత్తే’ విషయానికొస్తే.. తమిళంలో ఈ సినిమాకున్న క్రేజ్.. తెలుగులో మునుపటిలా లేదనే చెప్పాలి. అందుకే చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను ‘అన్నాత్తే’ సినిమాకు ఒక రెండు రోజులు ముందు రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ఏమైనా ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. ఇప్పటికే రజినీకాంత్, మీనా, కుష్బూలు ఈ సినిమాలో తన పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేసారు.  ఈ సినిమాలో  కీర్తి సురేష్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. జగపతిబాబు, ప్రకాష్ రాజు, సత్యదేవ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

  Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

  ఆచార్య విషయానికొస్తే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ సిద్ద అనే  మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు కామ్రేడ్స్ పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. మరోవైపు దేవాలయాలు మన జాతి సంపద. ఈ నేపథ్యంలో మన దేవాలయాల గొప్పదనాన్ని ఈ సినిమాలో చూపెట్టనున్నారు. సోనూసూద్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Acharya, Annaatthe Movie, Chiranjeevi, Koratala siva, Rajinikanth, Ram Charan

  ఉత్తమ కథలు