Chiranjeevi Vs Pawan Kalyan: చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయా. అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వీరిద్దిరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్న రాజకీయంగా వీళ్లిద్దరు వేరే బాటల్లో నడుస్తున్నారు. చిరంజీవి.. అప్పట్లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టినపుడు పవన్ కళ్యాణ్.. యువ రాజ్యం అధ్యక్షకుడిగా పనిచేసారు. మరోవైపు చిరు.. రాజకీయాల్లో కొనసాగలేక.. ఆ తర్వాత తన ప్రజా రాజ్యం పార్టీని.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆపై కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ క్యాబినేట్లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసారు. 2014 ఎన్నికల్లో ఏపీ తరుపున స్టార్ క్యాంపెనర్‌గా ప్రచారం నిర్వహించినా.. ఏపీలో ఒక్క సీటు సాధించలేక చతికిలపడిపోయింది. ఆ తర్వాత చిరంజీవి.. రాజకీయాలు అచ్చిరావని భావించి.. పూర్తిగా వాటిని పక్కనపెట్టి.. తన సినిమాలేవో చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్.. సినీ పరిశ్రమకు ఎన్నో రాయితీలతో పాటు కొన్ని సబ్సిడీలు ప్రకటించడంతో చిరంజీవి.. ఇన్ డైరెక్ట్‌గా టీఆర్ఎస్కు ఓటేయమని చెబుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీకి ఓటేయమని అభిమానులకు చెబుతున్నాడు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ Photo : Twitter
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుగా జనసేన పోటీ చేయాలనుకున్నా.. ఆ తర్వాత భారతీయ జాతీయ పార్టీ అభ్యర్ధనతో పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు తన అభిమానులకు బీజేపీకి ఓటేయమని చెబుతున్నాడు. ఈ రకంగా మెగా ఫ్యామిలీలో అన్నయ్య తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే.. తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం కేంద్రంలో అధికార బీజేపీకి ఓటేయమని చెబుతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో జీహెచ్ఎంసీ ఎన్నికలు చిచ్చు పెట్టాయనే చెబుతున్నారు మెగాభిమానులు. మొత్తంగా హైదరాబాద్ మహా నగర పాలిక ఎన్నికల్లో మెగా ఫ్యాన్స్ ఎవరి వైపు మొగ్గుచూపుతారనేది చూడాలి. మొత్తంగా చూసుకుంటే.. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు చూసే హైదారాబాదీ అభిమానులు.. సినిమా వరకే తమ అభిమానం చూపిస్తున్నట్టు పలు సందర్భాల్లో వ్యక్తం అయింది. ఓటు వేసే సమయానికి ఎవరికి వేయాలో వారికే వేస్తున్నారు ఆయా అభిమానులు. ఇక మొత్తంగా ఎన్నికల్లో సినిమా వాళ్ల ప్రభావానికి హైదారాబాదీలు లొంగరనే విషయం ఎన్నో సార్లు స్పష్టమైంది. అయినా.. ఈ ఎన్నికల్లో చిరు,పవన్ కళ్యాణ్ చెరో పార్టీకి సపోర్ట్ చేయడం ఇపుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.