అభిమానుల కోరికను చిరంజీవి, విజయశాంతి తీరుస్తారా..

మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి ఇద్దరు కలిసి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌లో సందడి చేసిన తీరు చూసి ఇద్దరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: January 7, 2020, 7:44 AM IST
అభిమానుల కోరికను చిరంజీవి, విజయశాంతి తీరుస్తారా..
చిరంజీవి,విజయశాంతి (Youtube/Credit)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ విజయశాంతి ఇద్దరు కలిసి మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్‌లో సందడి చేసిన తీరు చూసి ఇద్దరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఫిదా అయ్యారు.స్టేజ్ పై చిరు.. చిన్నపిల్లాడిలా మారి.. విజయశాంతితో తన పాత జ్ఞాపకాలను పంచుకున్న తీరుతో వీళ్లిద్దరు మళ్లీ సినిమాల్లో జోడిగా నటిస్తారా అనే ఊహాగానాలు మొదలైయ్యాయి. ఇప్పటికే విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో భారతి అనే లెక్చరర్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రను అనిల్ రావిపూడి మలిచిన తీరు.. ట్రైలర్‌లో కనిపించింది. దీంతో చిరంజీవి కూడా కొరటాల శివ సినిమాలో కానీ.. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలో కానీ విజయశాంతిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొరటాల శివను కలిసి ప్రస్తుతం చేస్తున్న సినిమా స్క్రిప్ట్‌లో ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు చేసి విజయశాంతి పాత్ర ఉండేటట్టు చేయమని చెప్పినట్టు సమాచారం. ఒకవేళ కొరటాల శివ సినిమా కాకపోతే.. త్రివిక్రమ్ సినిమాలోనైనా.. విజయశాంతితో మంచి పాత్రను చేయించాలానే పట్టుదలతో చిరంజీవి ఉన్నడట. మరోవైపు పాత్ర నచ్చితే.. చిరు సినిమాలో నటించడానికి తనకెలాంటి ఇబ్బంది లేనట్టు విజయశాంతి తన సన్నిహితల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.

chiranjeevi,chiranjeevi movies,vijayashanthi,vijayashanti movies,vijayashanti,chiranjeevi songs,chiranjeevi speech,chiranjeevi hit songs,chiranjeevi kondaveeti raja movie,megastar chiranjeevi,chiranjeevi & vijayashanthi,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi speech about vijayashanthi,chiranjeevi video songs,vijayashanthi movies,chiranjeevi birthday special,chiranjeevi hit movies,sarileru neekevvaru,sarileru neekevvaru songs,sarileru neekevvaru mega super event,sarileru neekevvaru trailer,sarileru neekevvaru pre release event,sarileru neekevvaru live,sarileru neekevvaru mega super event live,mahesh babu,anil ravipudi,sarileru neekevvaru mahes babu,sarileru neekevvaru mahesh babu,mahesh babu sarileru neekevvaru,sarileru neekevvaru movie songs,sarileru neekevvaru songs in telugu
’సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయశాంతిని హగ్ చేసుకున్న చిరు (Youtube/Credit)


ఒకవేళ మరోసారి చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తే.. చూడడానికి అభిమానులు కూడా రెడీగా ఉన్నారు. ఇక వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘సంఘర్షణ’ సినిమాలో కలిసి నటించారు.ఆ తర్వాత చిరు, విజయ శాంతిలు ‘దేవాంతకుడు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘ఛాలెంజ్’,‘చిరంజీవి’,‘కొండవీటి రాజా’, ‘ధైర్యవంతుడు’, ‘చాణక్య శపథం’,‘పసివాడి ప్రాణం’, ‘స్యయంకృషి’, ‘మంచి దొంగ’, ‘యముడికి మొగుడు’, ‘యుద్ధభూమి’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘రుద్రనేత్ర’, ‘కొండవీటి దొంగ’, ‘స్టూవర్టుపురం పోలీస్‌స్టేషన్’, ‘గ్యాంగ్ లీడర్’, ‘మెకానిక్ అల్లుడు’ వంటి 19 సినిమాల్లో జోడిగా నటించారు.

chiranjeevi vijayashanti may pairing again after long time in koratala siva movie,chiranjeevi,chiranjeevi movies,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,
విజయశాంతి, చిరంజీవి (twitter/Photos)


వీటిలో 10కి పైగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక 1993లో బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ‘మెకానిక్ అల్లుడు’ తర్వాత వీళ్లిద్దరు మళ్లీ జోడి కట్టలేదు. అప్పట్లో విజయశాంతికి, చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చాయని  అప్పట్లో ఫిల్మ్ నగర్ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. దాంతో చిరంజీవి, బాలకృష్ణలు కలిసి విజయశాంతిని తమ సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. ఆ తర్వాత విజయ శాంతి.. చిన్న చిన్న హీరోలతో ఆమె ప్రధాన పాత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత హీరోయిన్‌గా విజయశాంతి మార్కెట్ పడిపోతూ వచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇపుడు పదమూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఒకవేళ చిరంజీవి, విజయశాంతి కలిసి నటిస్తే.. 27 ఏళ్ల తర్వాత మరోసారి చిరంజీవి,విజయశాంతిల జోడిని తెరపై చూడొచ్చన్నమాట.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 7, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading