హోమ్ /వార్తలు /సినిమా /

Chiranjeevi : చిరంజీవికి జోడిగా బాలీవుడ్ భామ.. ఇద్దరితో రొమాన్స్ చేయనున్న మెగాస్టార్..

Chiranjeevi : చిరంజీవికి జోడిగా బాలీవుడ్ భామ.. ఇద్దరితో రొమాన్స్ చేయనున్న మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

    మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi )ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. (Acharya) ఆచార్య ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంత అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ ఆచార్య మరోసారి వాయిదా పడేఅవకాశం ఉందని అంటున్నారు. అది అలా ఉంటే చిరంజీవి సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. అందులో భాగంగా చిరంజీవి యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన అనుష్క నటించనుందట. మెగాస్టార్‌తో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నిశ్శబ్దం తర్వాత చాన్నాళ్లకు ఆమె ఇటీవల నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఇక చిరంజీవి, వెంకీ కుడుముల చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక్కడ విషయం ఏమంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరో హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాను అనుకుంటోందట చిత్రబృందం.

    వెంకీ కుడుములు విషయానికి వస్తే.. ఇటీవల నితిన్‌తో భీష్మ అనే సినిమా తీసి విజయం అందుకున్నారు. చిరంజీవి, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నారు.

    ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆచార్య విడుదలకు సిద్ధమవుతుండగా.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతోనూ చిరు సినిమాలు చేయాల్సి ఉంది. భోళా శంకర్ తాజాగా షూటింగ్‌ను కూడా మొదలు పెట్టింది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలై తెగ హల్ చల్ చేసింది. ఈ భారీ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

    అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్‌ను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ (Shruti Haasan) ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శృతి ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్' చేస్తోంది. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ గోపీచంద్ సినిమా‌లోను హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమాకు 'వాల్తేరు వీర్రాజు' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్.

    Amala Paul : అమలా పాల్ అదిరే అందాలు.. మరోసారి పరువాలు ఒలకబోసిన మలయాళీ అందం..

    ఇక కొరటాల శివ ఆచార్య విషయానికి వస్తే.. చిరంజీవి‌తో పాటు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. రామ్ చరణ్ (Ram Charan) పాత్ర దాదాపు ఓ 30 నిమిషాల నిడివి ఉండనుందట. ఆ పాత్ర సినిమాకు హైలెట్‌గా ఉంటుందట. ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడిందని సమాచారం. ఆచార్యలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ (Kajal Aggerwal) నటిస్తుంది. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే (PooJa Hegde) నటిస్తోంది. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

    ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మలయాళీ హిట్ సినిమా లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ఈ సినిమాను ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ( S. S Thaman) పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ స్టార్ బిజు మీనన్ (Biju Menon) కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

    మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) విషయానికి వస్తే.. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Anushka Shetty, Chiranjeevi, Sonakshi Sinha, Tollywood news

    ఉత్తమ కథలు