news18-telugu
Updated: July 15, 2020, 7:14 PM IST
సుజీత్, చిరంజీవి Photo : Twitter
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించి సూపర్ హిట్టైన ‘లూసిఫర్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్‌ను రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా కోసం ‘సాహో’ ఫేమ్ సుజిత్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈయన చిరంజీవిని సంతృప్తి పరిచేలా ఈ సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయలేదట. ఈయన చేసిన మార్పులు చిరు నచ్చలేదని టాక్. దీంతో ఈ సినిమా నుంచి సుజిత్ తప్పించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట. లూసిఫర్ రీమేక్ దర్శకత్వ బాధ్యతలను ఇపుడు సుజిత్ చేతుల్లోంచి వినాయక్ చేతుల్లోకి వెళ్లినట్టు సమాచారం.

చిరంజీవి వినాయక్ (Chiranjeevi Vinayak Lucifer movie remake)
ఇప్పటికే చిరంజీవి నటించిన ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబర్ 150’ వంటి పరభాష చిత్రాలను వినాయక్ తనదైన శైలిలో చిరుతో తెరకెక్కించి మంచి హిట్స్ అందించాడు. అందుకే ఇపుడు చేయబోతున్న ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలను కూడా వినాయక్కే అప్పగించాలనే ఆలోచనలో చిరు ఉన్నాడట. ఇప్పటికే చిరు.. వినాయక్‌ను పిలిచి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టమని కోరినట్టు సమాచారం. మొత్తానికి ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతల విషయమై మెగా కాంపౌండ్ నుంచి అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 15, 2020, 7:14 PM IST